పహిల్వాన్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన చిరు


మెగాస్టార్ చిరంజీవి కిచ్చా  సుదీప్ హీరోగా నటించిన పహిల్వాన్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు . కన్నడంలో స్టార్ హీరో అయిన కిచ్చా  సుదీప్ తెలుగులో ఈగ చిత్రంలో విలన్ గా నటించి ప్రేక్షకుల మెప్పు పొందిన విషయం తెలిసిందే . తాజాగా సుదీప్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రంసైరా నరసింహారెడ్డిచిత్రంలో నటిస్తున్నాడు దాంతో సుదీప్ కన్నడ సినిమా ఫస్ట్ లుక్ ని తెలుగులో పహిల్వాన్ గా రిలీజ్ చేసాడు

ఇక చిత్రంలో కిచ్చా  సుదీప్ పహిల్వాన్ గా నటిస్తున్నాడు . కండలు పెంచిన శరీరంతో సుదీప్ లుక్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చేలా ఉంది . సుదీప్ లుక్ కి ఫిదా అవ్వడం ఖాయం నెటిజన్లు , ప్రేక్షకులు . ఎందుకంటే సుదీప్ బక్క పలుచగా ఉంటాడు కానీ సినిమా కోసం తనని తాను మలుచుకున్న తీరుకి అభినందించడం ఖాయం . కన్నడ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి  రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు