ఆచార్యలో మహేష్ రోల్ పై క్లారిటీ ఇచ్చిన చిరు


ఆచార్యలో మహేష్ రోల్ పై క్లారిటీ ఇచ్చిన చిరు
ఆచార్యలో మహేష్ రోల్ పై క్లారిటీ ఇచ్చిన చిరు

మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే సోషల్ మీడియాలో ఎంటర్ అయ్యారు. అక్కడ చాలా యాక్టివ్ గా ఉన్నారు. కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన ఇబ్బందుల నుండి బయటపడడానికి చిరంజీవి కరోనా క్రైసిస్ చారిటి పేరుతో ఒక అకౌంట్ క్రియేట్ చేసి విరాళాలను ఆహ్వానిస్తున్న సంగతి తెల్సిందే. టాలీవుడ్ తరుపు నుండి చిరంజీవి ఆధ్వర్యంలో సహాయం జరుగుతోంది. అలాగే సోషల్ మీడియాలో తనకు నచ్చిన విషయాలపై స్పందిస్తూ చిరంజీవి చాలా యాక్టివ్ గా గడుపుతున్నారు.

ఇక ఇటీవలే ఇంటర్వ్యూలో చిరంజీవి పలు విషయాలపై స్పందించారు. ఆచార్య సినిమా విషయంలో కొన్ని విశేషాలను పంచుకుని ఫ్యాన్స్ కు సంతోషాన్నిచ్చారు. ఇంతకీ ఆచార్య విషయంలో ఆయన ఏం చెప్పారన్న విషయాన్నీ చూసుకుంటే ఇందులో చిరంజీవి విప్లవ నాయకుడిగా కనిపిస్తారన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసారు. అలాగే ముందు నుండీ ఈ చిత్రంలో ఉన్న ఒక స్పెషల్ రోల్ విషయంలో చిరంజీవి క్లారిటీ ఇచ్చారు.

ఈ చిత్రంలో మహేష్ బాబు నటిస్తున్నట్లుగా ఇటీవలే వార్తలు వచ్చాయి. ముందు చరణ్ అన్నారు తర్వాత మహేష్ అన్నారు చివరికి మళ్ళీ చరణ్ దగ్గరికే వచ్చినట్లు చెప్పారు. దీనిపై కూడా చిరంజీవి స్పందించారు. మహేష్ బాబు నాకు బిడ్డలాంటి వాడు. తనతో నటిస్తే అద్భుతమే అయితే ఈ పాత్ర కోసం చరణ్ ను అనుకుంటున్నాడు దర్శకుడు. మరి ఆర్ ఆర్ ఆర్ లో బిజీగా ఉన్న చరణ్ మా సినిమా కోసం డేట్స్ అడ్జస్ట్ చేయగలడో లేదో తెలియదు. రాజమౌళి, కొరటాల శివ కూర్చుని మాట్లాడుకుంటే ఈ విషయంపై క్లారిటీ వస్తుంది. సురేఖ కూడా చరణ్ ఈ సినిమాలో చేస్తే బాగుంటుందని ఆశిస్తోంది. మరి తల్లి కోరిక నెరవేరుతుందేమో చూడాలి.

ఇంకా తన బయోపిక్ ను రాసుకునే విషయంలో కూడా చిరంజీవి పాజిటివ్ గా స్పందించారు. ప్రస్తుతం పాత విషయాలను గుర్తుచేసుకుంటూ వీడియో రికార్డ్ చేస్తున్నానని, త్వరలో రాసే అవకాశముందని తెలిపారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.