కొర‌టాల శివ అలాంటి నిర్ణ‌యం తీసుకున్నారా?

కొర‌టాల శివ అలాంటి నిర్ణ‌యం తీసుకున్నారా?
కొర‌టాల శివ అలాంటి నిర్ణ‌యం తీసుకున్నారా?

బ‌లహీనుడిని బ‌ల‌వంతుడు దోచుకోవ‌డం ఆన‌వాయితీ బ‌ట్ ఏ ఛేంజ్.. ఆ బ‌ల‌హీనుడి ప‌క్క‌న కూడా ఓ బ‌ల‌ముంది.. జ‌న‌తా గ్యారేజ్‌.. వామ ప‌క్ష భావ‌జాలాన్ని మ‌రింత ప్ర‌భావ వంతంగా చూపిస్తూ క‌మ‌ర్ష‌య‌ల్ హిట్‌ల‌ని సొంతం చేసుకుంటున్నారు కొర‌టాల శివ. తొలి చిత్రం `మిర్చి` నుంచి ఇటీవ‌ల మ‌హేష్‌తో రూపొందించిన `భ‌ర‌త్ అనే నేను` చిత్రం వ‌ర‌కు స‌మాజిక సందేశాల‌ని అందిస్తూ ద‌ర్శ‌కుడిగా త‌న‌దైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు.

ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ భారీ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై హీరో రామ్‌చ‌ర‌ణ్‌, నిరంజ‌న్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు యాభై శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. క‌రోనా వైర‌స్ కారణంగా కీల‌క షెడ్యూల్‌ని వాయిదా వేయాల్సి వ‌చ్చింది. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి ఎండోమెంట్ అధికారిగా న‌టిస్తున్నారు.

ఇదిలా వుంటే ఇటీవ‌ల ఓ మీడియాతో ఇంట‌రాక్ట్ అయిన చిరంజీవి ద‌ర్శ‌కుడు కొర‌టాల తీసుకున్న అసాధార‌ణ‌మైన నిర్ణ‌యం గురించి వెల్ల‌డించి  షాకిచ్చారు. స‌మాజం ప‌ట్ల కొర‌టాల‌కు పూర్తి అవ‌గాహ‌న వుంద‌ని, రాజ‌కీయ నాయకుల్లో వ‌స్తున్న మార్పుకు, వారి మాట్లాడుతున్న తీరుకు శివ ఎంతో ఆవేద‌న‌ వ్య‌క్తం చేస్తుండేవాడ‌ని, స‌మాజానికి త‌న వంతు సేవ చేయ‌డం కోసం పిల్ల‌ల‌ని కూడా వ‌ద్ద‌నుకున్న గొప్ప వ్య‌క్తి కొర‌టాల శివ అని అస‌లు విష‌యం బ‌య‌ట పెట్టడం ఆస‌క్తిక‌రంగా మారింది.