వైరల్ అవుతున్న చిరంజీవి పోస్ట్!


 వైరల్ అవుతున్న చిరంజీవి పోస్ట్!
వైరల్ అవుతున్న చిరంజీవి పోస్ట్!
యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా గుండె పోటుతో హఠాత్తు గా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ వార్త యావత్ సినీ లోకాన్ని నివ్వెరపరిచింది. అర్జున్ మేనల్లుడిగా పరిచయమైనా కన్నడ ఇండస్ట్రీలో చిరంజీవి సర్జా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు.
అయితే చిన్న వయసులోనే చిరంజీవి ఆకస్మికంగా మరణించడం టాలీవుడ్, కోలీవుడ్ తో పాటు దక్షిణాదికి చెందిన పలువురు సినీస్టార్స్ షాక్ కు గురయ్యారు. తాజాగా చిరంజీవి సర్జా తన స్నేహితులతో చేసిన వాట్స్ అప్ చాట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
‘రేపు ఏం జరుగుతుందో తెలియదు ఫ్రెండ్స్ తో కలిసి వారం రోజులు టూర్ వెళ్లాలనుకుంటున్నాను’ అని చివరిసారిగా చిరంజీవి షార్జా చేసిన వాట్స్ అప్ చాట్ పలువురిని కంటతడి పెట్టిస్తోంది. చిరంజీవి షార్జా ఇటీవల హార్ట్ ఎట్టాక్ కారణంగా మృతి చెందిన విషయం తెలిసిందే.