ఈసారి చిరు గురి ఆర్ ఆర్ ఆర్ పై..


ఈసారి చిరు గురి ఆర్ ఆర్ ఆర్ పై..
ఈసారి చిరు గురి ఆర్ ఆర్ ఆర్ పై..

మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గరనుండి ఏ విధంగా రెచ్చిపోతున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మెగా ఫ్యాన్స్ తో పాటు మిగతా నెటిజన్లకు కూడా బోలెడంత వినోదాన్ని పంచుతున్నాయి ఆయన ట్వీట్స్. కాజల్ ను అమ్మడు అనడం కానీ, పూరి జగన్ తో బీచ్ ల గురించి మాట్లాడడం.. ఇలా సందర్భం ఏదైనా చిరు తన హ్యూమర్ ను మాత్రం వదిలిపెట్టలేదు. దీంతో నెటిజనులకు ఫుల్ పండగనే చెప్పాలి.

రామ్ చరణ్ ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు సింహాన్ని సింహం పిల్ల ఫాలో అయ్యిందని, అలాగే రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం ఇలా చిరు ప్రతీ దాంట్లోనూ తనదైన వెటకారాన్ని కలగలిపి చెబుతున్నాడు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 10 గంటలకు స్పెషల్ గిఫ్ట్ ఉంటుందని ఆర్ ఆర్ ఆర్ టీమ్ ప్రకటించింది. దాన్ని ఎన్టీఆర్ ఇవ్వబోతున్నాడని కూడా అన్నారు. అయితే రాజమౌళితో వ్యవహారం ఎలా ఉంటుందో తెలిసిందే కదా. ఏదీ అనుకున్న సమయానికి జరగదు. అలాగే 10 గంటలకు అనుకున్న వీడియో కాస్తా ఇప్పుడు లేట్ అయింది. ఎప్పుడు వస్తుంది అనే దానికి ఇంకా క్లారిటీ లేదు.

ఈ నేపథ్యంలో చిరంజీవి రంగంలోకి దిగాడు. “ఐ యాం వెయిటింగ్” అంటూ ఖైదీ నెం 150లో డైలాగ్ వదిలాడు. దానికి రాజమౌళి కూడా స్పందించడం విశేషం. అంటే సార్ అదీ కొంచెం కొంచమే.. ప్లీజ్ సార్ అంటూ క్షమించమన్నట్లుగా, కొంచమే ఆలస్యమవుతుందని స్పందించాడు రాజమౌళి.

ముందుగా చిరు ట్వీట్ దానికి జక్కన్న సమాధానం ఇలా కష్ట సమయాల్లో నెటిజన్లు ఫుల్ వినోదాన్ని పంచుతున్నారు. మరోవైపు ఎన్టీఆర్ కూడా రాత్రే నేను నీ గిఫ్ట్ ను జక్కన్నకు పంపించాను. అయితే రాజమౌళితో ఎలా ఉంటుందో తెలుసు కదా అందుకే ఆలస్యమైంది అని రామ్ చరణ్ కు ట్వీట్ చేసాడు ఎన్టీఆర్. దానికి చరణ్ ఆయనకు పంపావా. అసలు ఈ రోజుకి నా గిఫ్ట్ వస్తుందా అని స్పందించాడు. ఇది భలే ఫన్నీగా అనిపిస్తోంది జనాలకు.

Credit: Twitter