త్రిష త‌ప్పుకోవ‌డానికి అస‌లు కార‌ణం వేరేనా?


త్రిష త‌ప్పుకోవ‌డానికి అస‌లు కార‌ణం వేరేనా?
త్రిష త‌ప్పుకోవ‌డానికి అస‌లు కార‌ణం వేరేనా?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొర‌టాల శివ ఓ భారీ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. మెగా ప‌వ‌ర్ స్టాన్ రామ్‌చ‌ర‌ణ్‌, నిరంజ‌న్‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `ఆచార్య‌` పేరుతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ఇప్ప‌టికే యాభై శాతం చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంది. ఇందులో చిరు ఎండోమెంట్ అధికారిగా న‌టిస్తున్నారు.

మ‌రో కీల‌క అతిథి పాత్ర‌లో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టించనున్నారు. క‌రోనా వైర‌స్ ఎఫెక్ట్ కార‌ణంగా ఈ చిత్ర షూటింగ్‌ని నిర‌వ‌ధికంగా వాయిదా వేశారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మార్పు వ‌చ్చిన త‌రువాత‌ రెగ్యుల‌ర్  షూటింగ్ ప్రారంభిస్తార‌ట‌. ఈ చిత్రం నుంచి హీరోయిన్ త్రిష అర్థాంత‌రంగా త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే.

అయితే త్రిష త‌ప్పుకోవ‌డానికి కార‌ణం వేరే వుంద‌ని చిరంజీవి వెల్ల‌డించడం ఆస‌క్తిక‌రంగా మారింది. కొన్నిఅంగీక‌రించిన‌ప్పుడు ఒక‌లా వుంటాయ‌ని, ఆ త‌రువాతే మారుతుంటాయ‌ని వెల్ల‌డించి ఈ సినిమా నుంచి త‌ప్పుకుంటున్నాన‌ని వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. అయితే అందులో ఎలాంటి వాస్త‌వం లేద‌ని, తను మ‌ణిర‌త్నం సినిమా కార‌ణంగానే త‌న సినిమా నుంచి త‌ప్పుకుంద‌ని చిరు చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.