అరుదైన ఫొటోని షేర్ చేసిన మెగాస్టార్‌!

అరుదైన ఫొటోని షేర్ చేసిన మెగాస్టార్‌!
అరుదైన ఫొటోని షేర్ చేసిన మెగాస్టార్‌!

మెగా డాట‌ర్ కొణిదెల పెళ్లి హంగామా మొద‌లైంది. పెళ్లికి ఐదు రోజుల ముందుగానే మెగా ఫ్యామిలీ నిహారిక పెళ్లి సంద‌డిని స్టార్ట్ చేసింది. పెళ్లి కూతురు కార్య‌క్ర‌మం, ప్రీ వెడ్డింగ్ కార్య‌క్ర‌మాల‌తో సంద‌డి చేయ‌డం మొద‌లుపెట్టింది. ఈ నేప‌థ్యంలో తాజాగా చిరు చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. చాలా రోజుల విరామం త‌రువాత మెగాస్టార్ మ‌ళ్లీ ట్వీట్ట‌ర్ వేదిక‌గా నిహారిక‌తో క‌లిసి వున్న రెండు ఫొటోల‌ని షేర్ చేశారు.

చిన్నారి నిహారిక‌ని ఎత్తుకుని ఫొటోల‌కు పోజులిచ్చిన ఫొటోతో పాటు పెళ్లి కూతురు ఫంక్ష‌న్‌కు సంబంధించిన సెల్ఫీని షేర్ చేశారు. ఈ ఫొటోకు ఆస‌క్తిక‌రమైన పోస్ట్‌ని జ‌త చేశారు. `మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో ముందస్తుగా కాబోయే దంపతులకు నా శుభాకాంక్షలు.. ఆశీస్సులు. గాడ్ బ్లెస్ యు #NisChayWedding,
@IamNiharikaK అంటూ హ్యాష్ ట్యాగ్‌లిచ్చారు.

ఉద‌‌య్‌పూర్‌లోని ఓబెరాయ్ ఉద‌య్ విలాస్‌లో ఈ బుధ‌వారం నిహారిక – చైత‌న్య‌ల వివాహం జ‌ర‌గ‌బోతోంది. ఇందు కోసం మెగా ఫ్యామిలీలు ప్ర‌త్యేకంగా చార్టెడ్ ఫ్లైట్‌ల‌ని బుక్ చేసుకుని ఉద‌య్‌పూర్ వెళ్లారు. నాగ‌బాబు ఫ్యామిలీ ఓ ఫ్లైట్‌లో.. బ‌న్నీ- అల్లు అర‌వింద్ ఫ్యామిలీ ఓ ఫ్లైట్‌.. మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఓ ఫ్లైట్‌లో ఉద‌య్‌పూర్ వెళ్లారు.