ఆర్ ఎఫ్ సిలో స్ట్రైక్ చేస్తున్న చిరు.. కారణమేంటి?


Chiranjeevi shooting at RFC
Chiranjeevi shooting at RFC

సైరా చిత్రంతో తన పదేళ్ల నాటి కల తీర్చుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆ చిత్రంతో విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు అదరగొట్టినా కానీ ఇతర భాషల్లో ఫెయిల్ అయింది. ఏదైతేనేం చిరంజీవి కొన్ని నెలల విరామం తర్వాత తన తర్వాతి చిత్రాన్ని మొదలుపెట్టేశాడు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ సాగుతోంది. ముందు ఈ సినిమాకు దేవాదాయ ధర్మాదాయ శాఖలో జరిగే అవినీతిని బ్యాక్ డ్రాప్ గా ఎంచుకున్నట్లు సమాచారం. అయితే చూస్తుంటే ఆ బ్యాక్ డ్రాప్ కు తగ్గట్లుగా షూటింగ్ జరగట్లేదు. ఇటీవలే యూనియన్ నాయకుడిగా చిరంజీవి కనిపించిన స్టిల్స్ బయటకు వచ్చాయి.

ఇక ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిరంజీవి స్ట్రైక్ చేస్తున్న సీన్లను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ బ్యాక్ డ్రాప్ అదీ చూస్తుంటే 90ల కాలం నాటి సెటప్ ను ప్రతిబింబిస్తున్నారు. చూస్తుంటే కొరటాల శివ మరో భారీ కమర్షియల్ ఎంటర్టైనర్ ను అందిస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇప్పటికే మూడు పాటలను పూర్తి చేసిన యూనిట్ ప్రస్తుతం టాకీ పార్ట్ చిత్రీకరణ జరుపుకుంటోంది. మరి కొన్ని రోజులు ఇక్కడే షూటింగ్ ను కొనసాగిస్తారు.

సోను సూద్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం అందిన విషయం తెల్సిందే. ఇప్పటికే ఒక షెడ్యూల్ లో సోను సూద్ పాల్గొనగా వారి కాంబినేషన్ లో సీన్లు త్వరలో మళ్ళీ షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు కూడా కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం అందడంతో అసలే ఆకాశాన్నంటే అంచనాలతో ఉన్న చిత్రం మహేష్ రాకతో మరింత దూసుకెళ్లింది. సమ్మర్ లో మహేష్ ఈ చిత్రంతో జాయిన్ కానున్నాడు.

మణిశర్మ స్వరాలు అందిస్తోన్న ఈ సినిమాను రామ్ చరణ్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆగష్టులో చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలున్నాయి.