చిరంజీవి చిన్నల్లుడి సినిమా ఆగిపోయింది


Chiranjeevi Kalyaan Dhev
Chiranjeevi and Kalyaan Dhev

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్విజేత ” చిత్రంతో హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే . అయితే ఆ సినిమా ప్లాప్ కావడంతో ప్రారంభమైన రెండో సినిమా ఆగిపోయింది . విజేత రిలీజ్ కాకముందే రెండో సినిమాని పులి వాసు దర్శకత్వంలో ప్రారంభించాడు . అయితే విజేత ప్లాప్ అవ్వడంతో గ్యాప్ వచ్చింది .

ఇక ఆ గ్యాప్ లో రెండో సినిమా రష్ చూసుకున్నారట చిత్ర బృందం . ఇంకేముంది సరైన దిశలో లేదని అర్థమైందట అందుకే స్క్రిప్ట్ లో మరిన్ని మార్పులు చేయడమే కాకుండా కళ్యాణ్ దేవ్ లుక్ లో కూడా మార్పులు చేయాలనీ భావించారట దాంతో ఆ సినిమాని ఆపేశారు . స్క్రిప్ట్ మరింత పకడ్బందీగా రాసుకున్న తర్వాత సెట్స్ మీదకు వెళ్లనుందట . ఇక ఇప్పటి వరకు తీసిన మొత్తం చెత్త బుట్టలో పడేయడమే అన్నమాట .