మహేష్ – బన్నీ ఇగో వార్ పై చిరు ఏమంటున్నాడు!


Chiranjeevi to involve in Allu Arjun Mahesh Babu ego clash
Chiranjeevi to involve in Allu Arjun Mahesh Babu ego clash

సీజన్ ఎలాంటిదైనా, ఎన్ని సెలవులు ఉన్నా కూడా రెండు పెద్ద సినిమాలు ఒకేరోజు విడుదలవ్వడం అనేది ఏ చిత్రానికీ మంచిది కాదు. దీని వల్ల ఒకరు నష్టపోవడం, ఒకరు లాభపడిపోవడం లాంటివేం ఉండవు. ఇద్దరికీ ఏదొక రకంగా నష్టం తప్పదు. కానీ అల్లు అర్జున్ , మహేష్ బాబు మాత్రం ఈ విషయాలపై  దృష్టిపెట్టినట్లు లేదు. దృష్టి పెట్టినా పట్టించుకున్నట్లు లేదు. అందుకే ఇద్దరూ ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు రావడానికి నిర్ణయించుకున్నారు. మహేష్ బాబు నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ నటిస్తోన్న అల వైకుంఠపురములో చిత్రాలు జనవరి 12నే విడుదల కావడానికి మొగ్గు చూపుతున్నాయి. అసలు రిలీజ్ డేట్ ప్రకటనకు ఇరు వర్గాల మధ్యా చర్చలు జరిగినా ఎవరూ వెనక్కి తగ్గడానికి ఇష్టపడలేదు. ఇద్దరూ జనవరి 12 మీదే మంకు పట్టు పట్టుకుని కూర్చున్నారు. ఇక రిలీజ్ డేట్ ప్రకటన వచ్చేసాక మాత్రం ఎవరు చెప్పిన మాటైనా ఎందుకు వింటారు? ప్రకటన వచ్చాక రిలీజ్ డేట్ మార్చుకుంటే వెనక్కి తగ్గినట్లు ఉంటుందని లేనిపోని ఇగో సమస్యలతో రెండు చిత్రాలు కూడా విడుదల తేదీలు మార్చుకోవట్లేదు. దానికి తోడు పట్టుబట్టి మరీ ప్రతీ పోస్టర్ లోనూ పెద్ద పెద్ద అక్షరాలతో జనవరి 12 విడుదల అని మాత్రం వేస్తున్నారు.

నిర్మాతలకు పంచాయితీ పెట్టి నచ్చజెప్పినా, హీరోల వద్దే సమస్య అని తెలుస్తోంది. ఇద్దరు హీరోలు కూడా సమయం వచ్చినప్పుడు వేరే హీరోనే తగ్గుతాడు కంగారు పడొద్దు అన్న తరహాలో మాట్లాడుతున్నారట. అయితే బయ్యర్లు మాత్రం రిలీజ్ డేట్ విషయం తలచుకుంటేనే దిగాలు పడుతున్నారు. ఒకేరోజు రెండు పెద్ద సినిమాలు విడుదలైతే ఎఫెక్ట్ ఎలా ఉంటుందో వారికే బాగా తెలుసు. పైగా రెండు సినిమాలను భారీ రేట్లు పెట్టి కొంటున్నారు. తొలిరోజు వసూళ్లు ఏ సినిమాకైనా ముఖ్యమే. ఈ నేపథ్యంలో ఈ సమస్య ఇలా తెగట్లేదని, మెగాస్టార్ చిరంజీవి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

దసరా నారాయణరావు చనిపోయాక ఇండస్ట్రీ పెద్ద బాధ్యతను మెగాస్టార్ చిరంజీవి తీసుకున్న విషయం తెల్సిందే. మొన్న మా లో వివాదం వస్తే దాన్ని చిరంజీవే దగ్గరుండి పరిష్కరించారు. అలానే ఈ సంక్రాంతి ఇగో సమస్యను కూడా పరిష్కరించమని బయ్యర్లు కోరారట. చిరంజీవి కూడా కంగారు పడవద్దని దీనికి పరిష్కారం ఉంటుందని అభయమిచ్చాడని తెలుస్తోంది. చిరంజీవి చెప్పిన మాటకు అల్లు అర్జున్ దాటడు. అలానే మహేష్ కు కూడా చిరు అంటే అభిమానం ఎక్కువే. ఈ నేపథ్యంలో ఇద్దరు హీరోల మధ్య ఉన్న ఇగో సమస్యను చిరు తీరుస్తాడా?