మెగా వెబ్ సిరీస్‌కి రెడీ అంటున్నారు?


మెగా వెబ్ సిరీస్‌కి రెడీ అంటున్నారు?
మెగా వెబ్ సిరీస్‌కి రెడీ అంటున్నారు?

ప్ర‌స్తుతం అంతా డిజిట‌ల్ ప్లాట్ ఫామ్‌ల‌దే హ‌వా న‌డుస్తోంది. క‌రోనా క్రైసిస్ కార‌ణంగా లాక్ డౌన్ విధించ‌డంతో థియేట‌ర్ల‌న్నీ బంద్ అయిపోయాయి. వాటికి మోక్షం ఎప్పుడు ల‌భిస్తుందో తెలియ‌ని ప‌రిస్థితి. జూన్ జూలై అయినా ఆశ్చ‌ర్యం లేద‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. దీంతో డిజిట‌ల్ మాధ్య‌మాల వైపు ప్రేక్ష‌కులు చూస్తున్నారు. ఇంట్లో వుండి సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసే అవ‌కాశం వుండ‌టంతో డిజిట‌ల్ ప్లాట్ ఫామ్‌ల హ‌వా మొద‌లైంది.

దీంతో పెద్ద పెద్ద స్టా‌ర్స్ కూడా డిజిట‌ల్ ప్లాట్ ఫామ్‌ల వైపే దృష్టిపెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా అటు వైపుగా అడుగులు వేయాల‌ని వుంద‌ని త‌న మ‌న‌సులో కోరిక‌ని తాజాగా బ‌య‌ట‌పెట్ట‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఇటీవ‌ల వెబ్ సిరీస్‌ల‌కు ఆద‌ర‌ణ పెరుగుతోంద‌ని, తాను కూడా ఆ వైపు దృష్టి సారిస్తున్నానని చిరంజీవి తాజాగా వెల్ల‌డించారు.

సినిమాతో పోలిస్తే  అందుకు భిన్నంగా వెబ్ సిరీస్‌ల‌లో త‌మ‌ని తాము భిన్నంగా ఆవిష్క‌రించుకునే అవ‌కాశం ల‌భిస్తోంద‌ని, ఆ కార‌ణంగానే చాలా మంది వెబ్ సిరీస్‌ల‌లో న‌టించ‌డానికి ఆస‌క్తిని చూపిస్తున్నార‌ని చిరు తాజాగా వెల్ల‌డించారు. క‌రోనా క్రైసిస్ కొంత కాల‌మే వుంటుంద‌ని, మ‌ళ్లీ అంతా స‌మామూలే అయిపోతుంద‌ని, థియేట‌ర్లు తెరుచుకుంటాయ‌ని చిరు ఆశాభావం వ్య‌క్తం చేశారు. మ‌రి చిరు వెబ్ సిరీస్ కోరిక‌ని ఇప్ప‌టికే వెబ్ సిరీస్ ల‌ని మొద‌లుపెట్టిన  క్రిష్ తీరుస్తాడా? లేక చాలా కాలంగా చిరు కోసం ఎదురుచూస్క‌తున్న పూరి జ‌గ‌న్నాథ్ తీరుస్తాడా? అన్న‌ది వేచి చూడాల్సిందే.