కుటుంబాన్ని దేశాన్ని కాపాడండి!


కుటుంబాన్ని దేశాన్ని కాపాడండి!
కుటుంబాన్ని దేశాన్ని కాపాడండి!

క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న వేళ ప్ర‌జ‌ల్లో చైత‌న్యం క‌లిగించేందుకు ఓ వీడియో ద్వారా ముందుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి. చేతులు శుభ్రంగా క‌డుక్కోండి.. మ‌హ‌మ్మారి నుంచి మిమ్మ‌ల్ని మీరు ర‌క్షించుకోండి అంటూ అప్ప‌ట్లో చిరు చేసిన వీడియో చాలా మందిలో వైర‌స్ ప‌ట్ల అవేర్ నెస్‌ని జాగ్ర‌త్త‌ని తీసుకునేలా చేసింది. రోజులు నెల‌లు గ‌డుస్తున్నా క‌రోనా వైర‌స్ తీవ్ర‌త త‌గ్గ‌క‌పోగా సెల‌బ్రిటీల‌ని సైతం వ‌ణికిస్తుండ‌టంతో మెగాస్టార్ మ‌రో వీడియోతో ముందు కొచ్చారు.

మాస్క్ తప్పనిసరిగా ధరించండి.మిమ్మల్ని మీరు కాపాడుకోండి.మీ కుటుంబాన్ని, దేశాన్ని కాపాడండి. ప్లీజ్‌! అంటూ మెగాస్టార్ చేసిన రెండు వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఓ  వీడియోలో హీరో RX 100` ఫేమ్ కార్తికేయ మీసం మెలేస్తుంటే హ‌లో…మీసం మెలేయ‌డం వీర‌త్వ‌మే కానీ అది ఒక‌ప్పుడు..కానీ ఇప్పుడు ముఖానికి మాస్కు ధ‌రించ‌డం వీరుడి ల‌క్ష‌ణం.. అంటూ కార్తికేయ‌కు మాస్కుని అందించడం ఆక‌ట్టుకుంటోంది. మాస్కుని త‌ప్ప‌ని స‌రిగా ధ‌రించండి.. వీలైన‌న్ని సార్లు స‌బ్బుతో చేతులు శుభ్రంగా క‌డుక్కోండి. సామాజిక దూరాన్ని పాటించండి. మిమ్మ‌ల్ని మీరు కాపాడుకోండి. అలాగే మీ కుటుంబాన్ని ఈ దేశాన్ని కాపాడండి ప్లీజ్‌` అని మెగాస్టార్ మరోసారి సందేశాన్ని అందించారు.

మ‌రో వీడియోలో ఇషా రెబ్బా క‌నిపించింది. పెదాల‌కు లిప్ స్టిక్ పూస్తుంటే చిరున‌వ్వు ముఖానికి అందం. ఇప్పుడున్న స‌రిస్థితుల్లో ఆ చిరున‌వ్వు క‌ల‌కాలం నిల‌వాలంటే ముఖానికి మాస్క్ ధ‌రించ‌డం ఎంతో అవ‌స‌రం` అని చిరు చెబుతున్న వీడియో కూడా వైర‌ల్‌గా మారింది.