కొర‌టాల సినిమాలో చిరు క్యారెక్ట‌ర్ ఇదేనా?


కొర‌టాల సినిమాలో చిరు క్యారెక్ట‌ర్ ఇదేనా?
కొర‌టాల సినిమాలో చిరు క్యారెక్ట‌ర్ ఇదేనా?

తొలి తెలుగు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ ఆధారంగా రూపొందిన చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా క‌థానాయ‌క‌లుగా నటించిన ఈ చిత్రం ఇటీవ‌లే విడుద‌లై ఐదు భాష‌ల్లో విజ‌యాన్ని సాధించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా త‌రువాత కొర‌టాల శివ డైరెక్ష‌న్‌లో చిరంజీవి ఓ భారీ చిత్రాన్ని అంగీక‌రించారు. ఇటీవ‌లే ఈ చిత్రం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. చిరు న‌టిస్తున్న 152వ చిత్ర‌మిది.

విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా ప్రారంభించిన ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్‌ని ఇటీవ‌లే హైద‌రాబాద్‌లో ప్రారంభించారు. కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ కోసం కోకాపేట్‌లో ప్ర‌త్యేకంగా ఓ భారీ సెట్‌ని నిర్మించారు. ఫ‌స్ట్ షెడ్యూల్‌ని సంక్రాంతి వ‌ర‌కు పూర్తి చేయాల‌నుకుంటున్నార‌ట‌. తొలి సినిమా నుంచి ఏదో ఒక స‌మాజిక అంశాన్ని క‌థా వ‌స్తువుగా తీసుకుని సినిమాలు చేస్తూ వ‌స్తున్న ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఈ చిత్రాన్ని కూడా అదే పంథాలో తెర‌పైకి తీసుకురాబోతున్నార‌ట‌.

త్రిష క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి దేవాదాయ శాఖ‌కు సంబంధించిన అధికారిగా క‌నిపించ‌నున్నార‌ని ఫిలిం స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్ ఎడిటింగ్‌, తిరు ఫొటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలే వున్నాయి. ఇందులో మ‌రీ యంగ్‌గా క‌నిపించడం కోసం చిరుపై ఇటీవ‌లే లుక్ టెస్ట్‌ని కూడా చేశారు.