మొత్తానికి మెగాస్టార్ సినిమా నుండి అప్డేట్ వచ్చిందిగా!

మొత్తానికి మెగాస్టార్ సినిమా నుండి అప్డేట్ వచ్చిందిగా!
మొత్తానికి మెగాస్టార్ సినిమా నుండి అప్డేట్ వచ్చిందిగా!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ ఫ్లో లో ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాను చేస్తున్నాడు చిరంజీవి. ఈ చిత్రం ఏప్రిల్ లోనే చిత్రీకరణను పూర్తి చేసుకుని మే 13న విడుదల కానుంది. ఇదిలా ఉంటే చిరంజీవి  లూసిఫెర్ రీమేక్ ను, అలాగే  తమిళంలో సూపర్ హిట్ సాధించిన వేదాళం రీమేక్ ను చేస్తున్న విషయం తెల్సిందే.

ఈ రెండు ప్రాజెక్ట్స్ కాకుండా చిరంజీవి బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడని ఎప్పటినుండో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. వారు అధికారికంగా చేసిన ట్వీట్ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. బాబీ, చిరంజీవి కాంబినేషన్ లో సినిమాను తాము నిర్మిస్తున్నట్లు తెలిపారు.

దీంతో ఆచార్య తర్వాత చిరంజీవి లైనప్ కన్ఫర్మ్ అయింది. ముందుగా లూసిఫెర్ రీమేక్, ఆ తర్వాత వేదాళం రీమేక్, ఆ తర్వాత బాబీ సినిమాలను చేయనున్నాడు చిరంజీవి. మరి నాలుగు సినిమాలతో చిరు ఎన్ని హిట్లు అందుకుంటాడు అన్నది ఆసక్తికరంగా మారింది.