`వేదాళం` రీమేక్‌కు ముహూర్తం ఫిక్స్‌!

`వేదాళం` రీమేక్‌కు ముహూర్తం ఫిక్స్‌!
`వేదాళం` రీమేక్‌కు ముహూర్తం ఫిక్స్‌!

త‌మిళంలో స్టార్ హీరో అజిత్ న‌టించిన చిత్రం `వేదాళం`. `సిరుతై` శివ  తెర‌కెక్కించిన ఈ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ అక్క‌డ సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. ఈ మూవీ రీమేక్ హ‌క్కుల్ని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్ అధినేత సుంక‌ర అనిల్ సొంతం చేసుకున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని రీమేక్ చేయ‌బోతున్నారు. ఈ రీమేక్‌కు మెగాస్టార్ చిరంజీవి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. ‌‌

మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ఇప్ప‌టికే పూర్త‌యింది. సిస్ట‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ మూవీలో చిరుకు సిస్ట‌ర్‌గా కీర్తి సురేష్ ని ఎంపిక చేశారు. అయితే ఈ విష‌యాన్ని కీర్తి సురేష్ మాత్రం రివీల్ చేయ‌డం లేదు. ఇదిలా వుంటే ఈ మూవీని ఈ నెల 18న లాంఛ‌నంగా ప్రారంభిస్తున్న‌ట్టు తెలిసింది.

సంక్రాంతి త‌రువాత నుంచి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ని ప్రారంభిస్తామ‌ని ఇందుకు రెడీగా వుండాల‌ని మెహెర్ ర‌మేష్‌కి చిరు చెప్పిన‌ట్టు తెలిసింది. ఇదిలా వుంటే చిరు న‌టిస్తున్న `ఆచార్య‌` ఈ నెల 9 నుంచి ప్రారంభం కాబోతోంది. కీల‌క ఘ‌ట్టాల‌ని ఈ షెడ్యూల్‌లో చిత్రీక‌రించ‌బోతున్నారు.