చిరంజీవి కొత్త సినిమా ఆగస్టు నుండి


Chiranjeevi and Koratala Shiva
Chiranjeevi and Koratala Shiva

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ఆగస్టులో ప్రారంభం కానుంది . కొరటాల శివ దర్శకత్వంలో చరణ్ నిర్మించనున్న ఈ చిత్రం ఆగస్టు లో సెట్స్ పైకి వెళ్లనుంది . హాట్ భామ అనసూయ కీలక పాత్రలో నటించనుంది . ఇప్పటివరకు కొరటాల శివ తీసిన అన్ని సినిమాలు సందేశాత్మకంగా ఉన్నవే ! దాంతో ఈ సినిమా కూడా ఆ కోవలోకే చెందుతుందని గొప్ప సామాజిక సందేశంతో ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది .

ప్రస్తుతం చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని పూర్తిచేసే పనిలో ఉన్నాడు . సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని కూడా చరణ్ నిర్మిస్తుండటం విశేషం . ఇక ఈ సినిమాని దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు . అయితే అంతకంటే ముందే అంటే ఆగస్టు లో కొరటాల శివ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు .