మెగాస్టార్ `ఆచార్య‌` టీజ‌ర్ అప్‌డేట్ వ‌చ్చేసింది!


మెగాస్టార్ `ఆచార్య‌` టీజ‌ర్ అప్‌డేట్ వ‌చ్చేసింది!
మెగాస్టార్ `ఆచార్య‌` టీజ‌ర్ అప్‌డేట్ వ‌చ్చేసింది!

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజాగా చిత్రం `ఆచార్య‌`. కాజల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ రూపొందిస్తున్నారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంప‌నీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర‌ర్మిస్తున్న విష‌యం తెలిసిందే. నిరంజ‌న్‌రెడ్డి, రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌లు. ఈ చిత్ర టీజ‌ర్ కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో టీజ‌ర్ రిలీజ్ అప్‌డేట్ ఇస్తారా? ‌లేక న‌న్నే టీజ‌ర్‌ని లీక్ చేయ‌మంటారా అంటూ మెగాస్టార్ చిరంజీవి స‌ర‌దాగా కొరటాల‌తో సాగించి సంభాష‌ణ మంఘ‌ళ‌వారం సాయంత్రం వైర‌ల్‌గా మారిన విష‌యం తెలిసిందే. దీంతో టీజ‌ర్ అప్‌డేట్‌ని బుధ‌వారం ఉద‌యం ఇస్తానంటూ కొర‌టాల చిరుకు మాటిచ్చారు. ఇచ్చ‌న మాట ప్ర‌కారం `ఆచార్య‌` టీజ‌ర్‌ని ఈ నెల 29న సాయంత్రం 4.09 గంట‌ల‌కు రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించేశారు.

దీంతో మెగా ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్న టీజ‌ర్ అప్‌డేట్ రావ‌డంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ చిత్రంలోని కీల‌క అతిథి పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే రామ్‌చ‌ర‌ణ్ సెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది.