నా బయోపిక్ లో చరణ్ వద్దు – చిరంజీవిchiru against charan acting in his biopic
chiru against charan acting in his biopic

ఇప్పుడంతా బయోపిక్ ల జమానా నడుస్తోంది. స్ఫూర్తిమంతమైన వ్యక్తుల జీవితాలను తెరపై ఆవిష్కరించి కాసులు కూడబెట్టుకుంటున్నారు నిర్మాతలు. ఈ ప్రయత్నాలు చాలా వరకూ సక్సెస్ ని ఇస్తుండడంతో ఇవి మరింతగా జోరందుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ఎక్కడినుండి మొదలయ్యిందో తెలీదు కానీ మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ అంశం తెరపైకి వచ్చింది.

ఇటీవలే గద్దలకొండ గణేష్ చిత్ర ప్రమోషన్స్ లో చిరు బయోపిక్ గురించి ప్రస్తావన వస్తే.. చిరు బయోపిక్ లో నటించడానికి నేను సిద్ధమే. అయితే దానికి ముందు అర్హత రామ్ చరణ్ కి ఉంది. తను కాకపోతే తర్వాత నేనే అన్నాడు వరుణ్ తేజ్. దీంతో ఈ విషయానికి ప్రాధాన్యత పెరిగింది. ఇక సైరా సక్సెస్ మీట్ లో చిరుకి ఇదే ప్రశ్న ఎదురైంది.

దానికి చిరు సమాధానమిస్తూ.. “నా బయోపిక్ లో చరణ్ నటిస్తే వందకు వంద శాతం న్యాయం చేస్తాడు. అందులో ఏం సందేహం లేదు. కాకపోతే కొన్ని సమస్యలున్నాయి. చరణ్ పుట్టినప్పుడు సన్నివేశంలో ఆ పసివాడ్ని చరణే ఎత్తుకోవడం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అంతే కాదు, కొన్ని ఇబ్బందులున్నాయి. నా పోలికలతో సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఉంటారని అందరూ అంటుంటారు. వారిలో ఎవరైనా ఓకే” అని చిరు క్లారిటీ ఇచ్చాడు.