మెగాస్టార్‌ ఒళ్లు గ‌గుర్పొడిచింద‌ట‌!


మెగాస్టార్‌ ఒళ్లు గ‌గుర్పొడిచింద‌ట‌!
మెగాస్టార్‌ ఒళ్లు గ‌గుర్పొడిచింద‌ట‌!

ఉభ‌య తెలుగు ప్రేక్ష‌కుల‌తో పాటు దేశ వ్యాప్తంగా వున్న రాజ‌మౌళి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ హీరోలుగా న‌టిస్తున్నారు. హాలీవుడ్ ఫిల్మ్ `మోట‌ర్ సైకిల్ డైరీస్‌` స్ఫూర్తితో ఈ చిత్రాన్ని రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా, ఎన్టీఆర్ కొమ‌రం భీంగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌, టైటిల్ లోగో మోష‌న్ పోస్టర్‌ని ఉగాది సంద‌ర్భంగా చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఆర్ ఆర్ ఆర్ అనే టైటిల్ కి ఫుల్ డెఫినెష‌న్ ఏంటి ఏంటీ అని గ‌త  కొన్ని నెల‌లుగా ఎదురుచూస్తున్న ప్రేక్ష‌కుల‌కు క్లారిటీ ఇచ్చేసింది. ఆర్ ఆర్ ఆర్ అంటే రౌద్రం, ర‌ణం, రుధిరం అని మోష‌న్ పోస్ట‌ర్‌లో వెల్ల‌డించాడు రాజ‌మౌళి.

ఈ మోష‌న్ పోస్ట‌ర్ చూసిన మెగాస్టార్ చిరంజీవి `ఇప్పుడే `ఆర్ఆర్ఆర్‌` మోష‌న్ పోస్ట‌ర్ చూశా. ర‌నువిందుగా వుంది. నా ఒళ్లు గ‌గుర్పొడిచింది. కీర‌వాణి అద్భుత‌మైన నేప‌థ్య సంగీతం అందించారు. రాజ‌మౌళి, తార‌క్‌, చ‌ర‌ణ్ ప‌నితీరు అద్భుతంగా వుంది. ఈ ఉగాది రోజున అంద‌రిలో ఎన‌ర్జీ నింపారు` అని మెగాస్టార్ వెల్ల‌డించారు. వ‌ర్మ మాత్రం మ‌రోలా స్పందించారు. విరామం లేకుండా డిప్రెస్సింగ్ వార్త‌లు వ‌స్తున్న ఈ త‌రుణంలో జీవితంలో రాబోయే మంచి విష‌యాల కోసం ఎదురుచూడాల‌ని మాకు గుర్తి చేసినందుకు ధ‌న్య‌వాదాలు రాజ‌మౌళి అన్నాకు. కోవిడ్ -19 లాంటి భ‌యంక‌ర‌మైన విష‌యాలు వున్నాయి. `ఆర్ఆర్ఆర్‌` లాంటి గొప్ప విష‌యాలూ వున్నాయి అన్నారు వ‌ర్మ‌.