వరుణ్ కి క్లాస్ పీకిన చిరు


chiru suggestion to varun on mass movies
chiru suggestion to varun on mass movies

మెగా హీరో వరుణ్ తేజ్ కెరీర్ లో తొలిసారి మాస్ సినిమా చేస్తున్నాడు. అప్పట్లో లోఫర్ చేసినా దాన్ని మాస్ సినిమాగా కన్సిడర్ చేయలేము. ఇప్పటివరకూ 9 సినిమాలు చేసిన వరుణ్, కెరీర్ లో తొలిసారి మాస్ సినిమా చేయడంపై పూర్తి సంతృప్తిగా ఉన్నాడు.

“మాస్ సినిమా చేసిన ఫీలే వేరప్పా” అన్న డైలాగ్ కూడా కొట్టాడంటే అర్ధం చేసుకోవచ్చు వాల్మీకి సినిమాపై అతనెంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో. నిన్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా వరుణ్ కొన్ని ఆసక్తికర విషయాల్ని తెలియజేసాడు.

పవన్ బాబాయ్ కు గబ్బర్ సింగ్ వంటి పెద్ద హిట్ ఇచ్చిన దర్శకుడు నాతో సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. నేను 9 సినిమాలు చేసినా అందులో క్లాస్ సినిమాలు, లవ్ స్టోరీలు, డిఫరెంట్ చిత్రాలు ఉన్నాయి. చిరంజీవి గారు నాకెప్పుడూ ఒక మాస్ సినిమా చేయరా. మేమెందరం ఎందుకు మాస్ సినిమాలు చేస్తున్నామో నీకు అర్ధం కావడం లేదురా అనేవారు. దానర్ధం నాకు ఇప్పుడు తెలిసింది. సెప్టెంబర్ 20న విడుదలవుతున్న వాల్మీకి మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను” అని చెప్పాడు వరుణ్.