త‌లైవాకు మెగాస్టార్ టైటిల్ కావాల‌ట‌!


త‌లైవాకు మెగాస్టార్ టైటిల్ కావాల‌ట‌!
త‌లైవాకు మెగాస్టార్ టైటిల్ కావాల‌ట‌!

త‌మిళ హీరోలు, తెలుగు హీరోలు మెగాస్టార్ చిరంజివి సినిమా టైటిల్స్‌ని వాడేస్తున్నారు. వ‌రుస‌గా హిట్‌లు సొంతం చేసుకుంటున్నారు. `ఖైదీ` టైటిల్‌తో కార్తి బ్లాక్ బ‌స్టర్‌ని సొంతం చేసుకున్నాడు. ప్ర‌స్తుతం హీరో విజ‌య్ `మాస్ట‌ర్‌` టైటిల్‌తో ఓ భారీ చిత్రాన్ని చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల నాని కూడా చిరు న‌టించిన `గ్యాంగ్ లీడ‌ర్‌` టైటిల్‌ని వాడేసుకున్నాడుకానీ హిట్‌ని మాత్రం ద‌క్కించుకోలేక‌పోయాడు.

ఇదిలా వుంటే తాజాగా త‌లైవ‌ర్‌, త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకి కూడా మెగాస్టార్ టైటిలే కావాలట‌. ర‌జ‌నీ న‌టిస్తున్న 168వ చిత్రాన్ని స‌న్‌పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై క‌ళానిధి మార‌న్ ఓ భారీ పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ డ్రామాని నిర్మిస్తున్నారు. సిరుతై శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో వుంది. ర‌జ‌నీ రాజ‌కీయ ఎంట్రీకి సిద్ధ‌మ‌వుతున్న వేళ ఈ సినిమాతో మ‌రింతగా జ‌నాల‌కి ద‌గ్గ‌ర‌కావాల‌ని ర‌జ‌నీ ప్లాన్ చేశాట‌. త‌మిళంలో ఈ చిత్రానికి `అన్నాతే` (అన్న‌య్య‌` అనే టైటిల్‌ని ఇటీవ‌లే క‌న్ఫ‌ర్మ్ చేశారు.

తెలుగులోనే అదే స్థాయిలో వుండాలంటే `అన్న‌య్య‌` టైటిల్ అయితేనే బాగుంటుంద‌ని భావిస్తున్నార‌ట‌. ఇది చిరు న‌టించిన మూవీ టైటిల్. ఇద‌యితే తెలుగు ప్రేక్ష‌కుల్లోకి ఈజీగా వెళ్లిపోతుంద‌ని, దీన్నే ఖ‌రారు చేయాల‌ని స‌న్‌పిక్చ‌ర్స్‌తో పాటు సిరుతై శివ కూడా డిసైడ్ అయిన‌ట్టు తెలిసింది. ఈ టైటిల్‌తో అయినా ర‌జ‌నీ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని అందుకుంటారేమో చూడాలి.