చిరు టైటిల్‌తో శ్రీ‌కాంత్ సినిమా మొద‌లైంది!


Chiru title for Srikanth film
Chiru title for Srikanth film

ఈ మ‌ధ్య చిరంజీవి టైటిల్స్‌ని తెగ వాడేస్తున్నారు. అలా వాడిన చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వాజ‌యాల్ని సొంతం చేసుకుంటుండ‌టంతో టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం ఇదొక ట్రెండ్‌గా మారింది. చిరు సినిమా `గ్యాంగ్ లీడ‌ర్‌` టైటిల్‌ని నాని, ఖైదీ, దొంగ చిత్రాల టైటిల్స్‌ని కార్తి సొంతం చేసుకుని ఆ సినిమాల‌తో విజ‌యాల్ని ద‌క్కించుకున్నారు. తాజాగా ఈ జాబితాలో హీరో శ్రీ‌కాంత్ చేరిపోయారు.   చిరంజీవి, శ్రీ‌కాంత్ మధ్య మంచి అనుబంధం వున్న విష‌యం తెలిసిందే.

తాజాగా శ్రీ‌కాంత్ కూడా చిరు హిట్ సినిమా టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నారు. 1998లో చిరంజీవి హీరోగా వ‌చ్చిన చిత్రం `మ‌ర‌ణమృదంగం`. అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా వ‌సూళ్ల ప‌రంగా మంచి పేరుని సొంతం చేసుకుంవ‌ది. ఇప్పుడు అదే టైటిల్‌తో శ్రీ‌కాంత్ హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. సోమ‌వారం ఈ చిత్రం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. వెంక‌టేష్ రెబ్బ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మ‌ధు రెబ్బ‌, వ‌బ్బిలిశెట్టి చిరంజీవి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

నాకు ఇష్ట‌మైన టైటిల్‌తో ఈ సినిమా వ‌స్తున్నందుకు ఆనందంగా వుంది. ప్ర‌జెంట్ ట్రెండ్‌కు అనుగుణంగా రూపొందుతున్న ఈ చిత్రం ఖ‌చ్చితంగా హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌క‌ముంది. ప‌క్కా ప్లానింగ్‌తో అనుకున్న షెడ్యూల్ ప్ర‌కారం చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాం` అని హీరో శ్రీ‌కాంత్ తెలిపారు.