కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్


chitrangada singh cry after seeing her role chopped

తన పాత్రకు ప్రాధాన్యత ఉందని చెప్పడమే కాకుండా 30 రోజుల పాటు షూటింగ్ చేసి తీరా సినిమా విడుదల సమయానికి నా పాత్ర నిడివి ని తగ్గించారని , నాపై చిత్రీకరించిన పలు సన్నివేశాలను కట్ చేసారని కన్నీళ్లు పెట్టుకుంది బాలీవుడ్ భామ చిత్రాంగద సింగ్ . సీనియర్ హీరో సంజయ్ దత్ , చిరంగదా సింగ్ , మహి గిల్ ల కాంబినేషన్ లో ” సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్ స్టర్ 3” సినిమా రూపొందింది . అయితే ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు ప్రాధాన్యత ఉందని చెప్పడమే కాకుండా చిత్రాంగద సింగ్ పై 30 రోజుల పాటు పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించారట దర్శకుడు తిగ్ మాన్షు దూలియ .

కానీ తీరా రిలీజ్ సమయానికి తనకు మాట మాత్రంగానైనా చెప్పకుండానే చాలా సన్నివేశాలు తీసేశారని , సినిమా చూసి షాక్ అయ్యానని కన్నీళ్ల పర్యంతం అయ్యింది . నా పై చిత్రీకరించిన సన్నివేశాలను కట్ చేసి మహి గిల్ పాత్ర ని ఎక్కువ చేసి చూపించారని మండిపడుతోంది . అసలు ఎందుకు ఇలా చేసారని నా కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యిందని అంటోంది చిత్రాంగదా సింగ్ . నిజమే చాలా సినిమాల్లో ఇది జరిగేదే ! చాలా సన్నివేశాలు తీస్తారు కానీ తీరా సమయానికి చాలా సన్నివేశాలు తీసెయ్యడమే కాకుండా పాత్రలను కూడా కట్ చేస్తుంటారు నిడివి పేరుతో .

English Title: chitrangada singh cry after seeing her role chopped