చిత్ర‌పురిలో సీనీ కార్మికుల‌కు మాత్ర‌మే ఇండ్లు కేటాయించాలి : ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్


prahtni ramkrishna goud
prahtni ramkrishna goud

చిత్ర‌పురిలో సీనీ కార్మికుల‌కు మాత్ర‌మే ఇండ్లు కేటాయించాలి :  ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్

సినీ కార్మికులకు చెందిన చిత్రపురి కాలనీలో ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జ‌రిగాయ‌ని చిత్ర‌పురి పోరాట స‌మితి నిర‌వ‌ధిక నిర‌హార దీక్ష‌లు చేప‌డుతోంది.. మ‌న భూమి ,మ‌న ఇల్లు ,మ‌న హ‌క్కు నినాదాల‌తో గ‌త 26 రోజుల నుంచి అలుపెరుగ‌ని పోరాటం చేస్తోంది చిత్ర‌పురి పోరాట స‌మితి……సినీ కార్మికుల కోసం ప్ర‌భుత్వం కేటాయించిన 67 ఎక‌రాల్లో 70 శాతం బ‌య‌టివాళ్ల‌కే  ఒక్కో ఇంటికి 1 ల‌క్ష నుంచి 20 ల‌క్ష‌ల వ‌ర‌కు లంచాలు తీసుకుని జూనియ‌ర్ ఆర్టిస్ట్ ,మ్యూజిషియ‌న్ ,డైలాగ్ ఆర్టిస్ట్ ,డైరెక్ట‌ర్స్ , రైట‌ర్స్ అసోషిస‌యేష‌న్స్ స‌భ్య‌త్వాలు సృష్టించి ఎన్ ఆర్ .ఐల‌కు ఇంజ‌నీర్ల‌కు ,బ్యాంక్ ఎంప్లాయిస్ కి ,బిల్డ‌ర్స్ కి ,డాక్ట‌ర్ల్ కి అడ్డ‌దారిలో ఇండ్లు ఇచ్చి కోట్లు గ‌డించార‌ని ఆరోపించారు.. చిత్రపురి కాలనీ హౌసింగ్‌ సొసైటీ కార్యవర్గ సభ్యుల అవినీతి అక్రమాల పై విచారణ జరిపించాల‌ని , సినిమాయేతరులను వెంటనే ఆ ఇండ్ల నుంచి ఖాళీ చేయించి అర్హులైన సినీకార్మికుల‌కు ఇండ్లు  కేటాయించాలనే డిమాండ్ చేస్తున్నారు..చిత్ర‌పురి పోరాట స‌మితి ఆధ్వ‌ర్యంలో  కొన్నిరోజుల‌ క్రితం చేప‌ట్టిన ర్యాలీ కి మ‌ద్ద‌తు తెలిపిన తెలంగాణ ఫిల్మ్ ఛాంబ‌ర్ అధ్య‌క్షుడు ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ ..ఈ రోజు కూడా దీక్ష‌లో పాల్గోన్నారు.. ఈ సంద‌ర్భంగా మీడియాతో…

ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ మాట్లాడుతూ….  చిత్ర‌పురి పోరాట స‌మితి చేస్తున్న ఆరోప‌ణ‌లు వాస్తవం ఉంది..24 క్రాప్ట్స్ లో ప‌నిచేస్తున్న సినీకార్మికుల‌కు కాకుండా సినిమాయేత‌రుల‌కు చిత్ర‌పురిలో ఇండ్లు కేటాయించారు..సుమారు 5 వేల‌కు పైగా  నిజ‌మైన  సినీకార్మికులు ఇండ్ల కేటాయించాల్సి ఉంది..26 రోజులుగా దీక్ష‌లు చేప‌డుతున్నా  చిత్ర‌పురి హౌస్ంగ్ సోసైటి నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తోంది అన్నారు.. చిత్ర‌పురి హౌసింగ్ సోసైటి లో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌లను ప్ర‌భుత్వ దృష్టికి తీసుకెళ్తామ‌ని తెలిపారు… అంతేకాకుండా సినీ కార్మికుల‌కు ఇచ్చిన స్థ‌లాన్ని కైరోస్ గ్లోబ‌ల్  ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ కి కేటాయించ‌డం చ‌ట్ట విరుద్ద‌మ‌ని…వెంట‌నే ఆ స్కూల్ ను తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు…అంతేకాకుండా ప్ర‌భుత్వం కేటాంచ‌బోయే 9 ఏక‌రాల‌ను చిత్ర‌పురి పోరాట స‌మితికి  కేటాయించాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరుతామ‌ని తెలిపారు…

క‌స్తూరి శ్రీనివాస్ మాట్లాడుతూ …. చిత్ర‌పురి కాల‌నీ లో సినీ కార్మికుల‌కే  ఇళ్లు  అద్దెకు దోర‌క‌డం లేద‌ని అన్నారు.. సినీయేత‌రులు ఓన‌ర్లుగా ఉండ‌టం వ‌ల్ల‌నే ఈ ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని అన్నారు..సినీయేత‌ర‌ల‌ను ఖాళీ చేయించి  అర్హులైన సినీ కార్మికుల‌కు ఇండ్లు కేటాయించాల‌ని డిమాండ్ చేశారు.. అంతేకాకుండా న్యాయం కోసం పోరాటం చేసేవారిని బెదిరిస్తున్నార‌ని , ఎవ‌రు బెదిరించిన  న్యాయం జ‌రిగే వ‌ర‌కు పోరాటం చేస్తామ‌ని అన్నారు..  చిత్ర‌పురి కాల‌నీకోసం కృషి చేసిన మ‌హ‌నీయుడు యం .ప్ర‌భాక‌ర్ రెడ్డి విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌క‌పోడం చూస్తే చిత్ర‌పురి హౌసింగ్ సోసైటికి ఉన్న నిబ‌ద్ద‌త ఏంటో అర్ధం చేసుకోవ‌చ్చ‌ని అన్నారు…

వీరితో పాటు బి న‌ర‌సింహా రెడ్డి , మ‌హేంద‌ర్ ,ఓ ర‌విశంక‌ర్ , ముర‌ళి పులువురు సినీకార్మికులు పాల్గోన్నారు..