మినీ రివ్యూ: సినిమా బండి

మినీ రివ్యూ: సినిమా బండి
మినీ రివ్యూ: సినిమా బండి

ప్రస్తుతం థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో ఓటిటిలోనే కంటెంట్ విడుదలవుతోంది. రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన సినిమా ‘సినిమా బండి‘. ఈ చిత్రం ట్రైలర్ తోనే బాగా ఆకర్షించింది. పల్లెటూరి వాతావరణం, అమాయకత్వం ప్రతిబింబించే పాత్రలతో కేరాఫ్ కంచెరపాలెం, మెయిల్ వంటివి గుర్తువస్తాయి. అయితే సినిమా బండి ఆ స్థాయిని అందుకుందో లేదో చూద్దాం.

వీరబాబు (వికాస్ వశిష్ఠ) ఒక పల్లెటూర్లో ఆటో నడుపుకుంటూ ఉంటాడు. తన కుటుంబంతో సంతోషంగా ఉన్న వీరబాబుకు తన ఆటోలో ఖరీదైన కెమెరా దొరుకుతుంది. దీంతో సినిమా తీద్దాం అన్న ఆలోచన వచ్చి తన ఊర్లోనే ఉండే ఫోటోగ్రాఫర్ గణ (సందీప్ వారణాసి)ను కలిసి ప్రయత్నాలు మొదలుపెడతాడు. సినిమా బండి కథ అంతా సినిమా తీయడానికి వారు పడే పాట్లు, చివరికి ఎలాంటి సినిమా తీశారు అన్న నేపథ్యంలో సాగుతుంది.

ఇక పెర్ఫార్మన్స్ ల విషయానికొస్తే ఒకరని కాదు కానీ అందరి పెర్ఫార్మన్స్ అమాయకత్వంతో నిండి ఆకట్టుకుంటుంది. వికాస్ వశిష్ట చాలా న్యాచురల్ గా ఉన్నాడు. మిగిలిన వారు కూడా ఓకే. ఇక టెక్నీకల్ గా కూడా సినిమా బండి మెప్పిస్తుంది. నేపధ్య సంగీతం మెప్పిస్తుంది. దర్శకత్వం కూడా ఇంప్రెస్ చేస్తుంది.

మొత్తంగా సినిమా బండి ఒక మంచి ఇంప్రెషన్ ను కలిగిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మిస్ అవ్వకండి.