‘సినిమాచూపిస్త మావ’కు నాలుగేళ్లు


cinema chupista maava completed 4years
cinema chupista maava completed 4years

రాజ్ తరుణ్ హీరోగా అవికా గోర్ హీరోయిన్ గా త్రినాథ రావ్ నక్కిన దర్శకత్వంలో లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మించిన చిత్రం సినిమాచూపిస్త మావ. రావు రమేష్ ముఖ్య పాత్ర పోషలు. ప్రసన్న కుమార్ బెజవాడ అందించిన డైలాగ్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి.

శేఖర్ చంద్ర అందించిన మ్యూజిక్ హైలైట్ అయ్యింది. కాగా ఈ చిత్రం నేటితో నాలుగేళ్లు పూర్తిచేసుకుంది. ఈ సినిమా హిట్ తో రాజ్ తరుణ్ వెనుదిరిగి చూడలేదు. వరుస సినిమా ఛాన్సులు వచ్చాయి. చిన్న బడ్జెట్లో రూపొందిన ఈ చిత్రం నిర్మాతలకు అత్యధిక లాభాలను తెచ్చిపెట్టింది.

ఇక దర్శకుడు త్రినాథ రావ్ నక్కిన ఈ సినిమా తరువాత నానితో నేను లోకల్, రామ్ తో హాలోగురు ప్రేమకోసమే చిత్రాలను రూపొందించారు. హ్యాట్రిక్ హిట్స్ సాధించిన త్రినాధరావు నెక్స్ట్ వెంకటేష్ తో సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సురేష్ బాబు నిర్మించనున్నారు.