ఎన్టీఆర్ కు భార్య తో గొడవ ఎందుకో తెలుసా


clashes between ntr and lakshmi pranathi

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతి తో గొడవలు జరుగుతుంటాయట ! అయితే ఆ గొడవలు ఎప్పుడెప్పుడు ? ఎందుకు అవుతున్నాయో తెలుసా …… … సెల్ ఫోన్ ల విషయంలో……. ఫోటోలు దిగడంలో గొడవలు జరుగుతున్నాయట . స్మార్ట్ ఫోన్ లు వచ్చాయి కాబట్టి వాటిలో ఫోజిస్తూ రకరకాల భంగిమల్లో ఫోటోలు తీయాలని వాటిని భద్రపరుస్తానని అంటుందట ప్రణతి అయితే ఎన్టీఆర్ మాత్రం ఫోటోలకు ఫోజివ్వాలంటే ఇబ్బంది పడుతుంటాడట ! సెల్ఫీ కి ఫోజివ్వు అని ప్రణతి అడుగుతుందట కానీ ఎన్టీఆర్ మాత్రం మాములుగా ఎలా ఉంటానో అలా ఫోటో దిగడానికి అభ్యంతరం లేదు కానీ సెల్ఫీ కోసం ముఖాన్ని ఇష్టమొచ్చినట్లు పెట్టడం నా వల్ల కాదని దాంతో మా ఇద్దరికీ గొడవ అవుతుందని అంటున్నాడు ఎన్టీఆర్ .

ప్రతీరోజు దిగిన ఫోటోలను జాగ్రత్త పెడుతుందట లక్ష్మి ప్రణతి . ఎన్టీఆర్ తో పాటుగా ఇద్దరు పిల్లలతో కలిసి దిగిన ఫోటోలు చాలా ఉన్నాయట ! వాటిని భద్రపరచడం లక్ష్మి ప్రణతి పనిగా పెట్టుకుందట . ఇక సెల్ ఫోన్ అంటే కూడా ఇష్టం లేదట ఎన్టీఆర్ కు . అందుకే ఓ మూడు నెలల పాటు సెల్ ఫోన్ కు , అలాగే సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాడట ఎన్టీఆర్ కానీ సెల్ ఫోన్ కు దూరంగా ఉండటం అనేది దాదాపుగా అసాధ్యం ఎందుకంటే గాలి పీల్చడం ఎంత అవసరమో ? సెల్ ఫోన్ అన్నది అంత అవసరమై పోయింది . భోజనం చేయకుండా ఉండొచ్చేమో కానీ ఫోన్ చేయకుండా ఒక్క గంటైనా ఉండగలరా ?

English Title: clashes between ntr and lakshmi pranathi