కేరాఫ్ కంచ‌ర‌పాలెం అక్క‌డ కూడా!


కేరాఫ్ కంచ‌ర‌పాలెం అక్క‌డ కూడా!
కేరాఫ్ కంచ‌ర‌పాలెం అక్క‌డ కూడా!

`కేరాఫ్ కంచ‌ర‌పాలెం`.. జీవితంలోని నాలుగు ద‌శ‌ల్లో జ‌రిగే ఓ అంద‌మైన ప్రేమ‌క‌థ‌ని ద‌ర్శ‌కుడు వెంక‌టేష్ మ‌హా త‌న‌దైన గ‌మ్మ‌త్తు స్క్రీన్‌ప్లేతో ట్విస్టుల‌తో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా న‌డిపించిన తీరుకు స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల‌తో పాటు ప‌లు అవార్డులు ద‌క్కాయి. నాలుగు జంట‌ల‌తో ప్యార‌ల‌ల్‌గా క‌థ న‌డిపించ‌డం కూడా ఓ కొత్త ఒర‌వ‌డికి నాంది ప‌లికింది.

ఇదే చిత్రాన్ని ప్ర‌స్తుతం త‌మిళంలో రీమేక్ చేస్తున్నారు, `కేరాఫ్ కాద‌ల్` పేరుతో రీమేక్ అవుతోంది. శ్రీ‌షిరిడీ సాయి ఫిలింస్‌, బిగ్ ప్రింట్ పిక్చ‌ర్స్‌, శ‌క్తి ఫిల్మ్ ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రేమ‌కు వ‌య‌సులేదు అనే క్యాప్ష‌న్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హేమాంబ‌ర్ జాస్తి రూపొందిస్తున్నారు. క‌ల్పాతి ఎస్‌. అఘోరంకు చెందిన ఏజీఎస్ సంస్థ రిలీజ్ చేస్తున్న ఈ చిత్ర ట్రైల‌ర్‌ని హీరో కార్తి రిలీజ్ చేశారు.

ఫీల్‌గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్ `కేరాఫ్ కాద‌ల్‌` ట్రైల‌ర్‌ని రిలీజ్ చేయ‌డం ఆనందంగా వుంది. అని హీరో కార్తి సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఈ నెల 20న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కొత్త త‌రహా స్క్రీన్‌ప్లేతో రూపొందిన ఈ చిత్రం త‌మిళ ప్రేక్ష‌కుల్ని కూడా మెస్మ‌నైజ్ చేస్తుందో లేదో తెలియాలంటే ఈ నెల 20 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.