కేర్ ఆఫ్ వాట్సప్’ ట్రైలర్ విడుదలC/O WhatsApp Trailer Launch

మహాముని ఈవెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ రెడ్డి సమర్పించు చిత్రం ‘కేర్ ఆఫ్ వాట్సప్’. బాహుబలి లో ప్రభాస్ చైల్డ్ యాక్టర్ నిఖిల్, సాహితి హీరో హీరోయిన్స్ గా నీరజ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు దర్శకుడు అల్లాడి రవీందర్ రెడ్డి కాగా.. నిర్మాత లక్ష్మి కాంత్ రెడ్డి. ఈ చిత్ర ట్రైలర్ ను సీనియర్ డైరెక్టర్ సముద్ర చేతుల మీదుగా, ఆడియో బిగ్ సీడీని నటుడు నోయల్ చేతుల మీదుగా విడుదల చేయించారు. కోటేశ్వర్ రావు, మిర్చి మాధవి, రాజేందర్,తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మొదటగా

సముద్ర మాట్లాడుతూ లవ్డ్ టీనేజ్ స్టోరీ అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. యాక్షన్, ఎమోషన్స్ ఉన్నప్పుడే సినిమా ఆడుతుంది.. అది ఈ సినిమాలో కనపడుతోంది.. ఫైట్స్, సాంగ్స్ బాగున్నాయి.. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.

మరో ముఖ్య అతిథి నటుడు నోయల్ మాట్లాడుతూ.. మంచి కంటెంట్ ఉంటుందని అనుకుంటున్నా.. ఒక ఇన్సిడెంట్ జరిగితే వెంటనే వాట్సప్ లో వచ్చేస్తుంది. అంత ఇంపార్టెంట్ ఉంది వాట్సప్ అలాంటి పేరుతోనే సినిమాను ప్లాన్ చేశారు యూనిట్. వీరి కష్టం కనపడుతోంది..అందరికీ బెస్ట్ విషెస్ తెలియచేస్తున్నాఅన్నారు.

దర్శకుడు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ..ప్రొడ్యూసర్ ఎంతో సప్పోర్ట్ చేయబట్టే ఈ సినిమా ఇక్కడి దాకా చేరుకుంది. ప్రతి రోజూ వాట్సప్ తోనే రోజు మొదలవుతుంది.. వాట్సప్ తోనే రోజు ముగుస్తుంది..ఇలాంటి తరుణంలో మా సినిమా అందరికీ ప్రతి రోజూ గుర్తుకు రావాలనే సినిమా కు ఈ టైటిల్ పెట్టడం జరిగింది అన్నారు.

నిర్మాత లక్ష్మీ కాంత్ రెడ్డి మాట్లాడుతూ.. నిర్మాతగా ఇది నా మొదటి సినిమా. డైరెక్టర్ చాలా కస్టపడి సినిమా చేశారు.. అందరూ మంచి సహకారాన్ని అందించారు. అతి త్వరలోనే సినిమాను విడుదల చేయాలనుకుంటున్నామని చెప్పారు.

ఈ సినిమాలో అవకాశం ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు, చాలాకష్టపడి సినిమా చేశాము.. తప్పకుండా నచ్చే చిత్రం అవుతుందని ఆశిస్తున్నాం అని హీరో నిఖిల్, హీరోయిన్ సాహితితెలియచేసారు.

 

నిర్మాత: లక్ష్మీ కాంత్ రెడ్డి, సహా నిర్మాత: కొండా రాఘవేంద్ర రెడ్డి,(దేవకర్ర), దర్శకుడు: అల్లాడి రవీందర్ రెడ్డి సంగీతం: రాజేష్ తేలు, డీఓపీ: భాస్కర్ దోర్నాల, ఎడిటర్: వినోద్ అద్వై, యాక్షన్: నాభ. రాబిన్ సుబ్బు, ఆర్ట్: మోహన్, డీటీఎస్: కలి యస్. అశోక్, డిఐ: భానుప్రకాష్.