టీజ‌ర్ టాక్ : ప‌్రేమ గొప్ప‌దా.. భ‌యం గొప్ప‌దా?Colour Photo Teaser launched by crezy hero Vijay Deverakonda
Colour Photo Teaser launched by crezy hero Vijay Deverakonda

హృధ‌య కాలేయం, కొబ్బ‌రిమ‌ట్ట లాంటి స్పూఫ్ చిత్రాల‌తో మంచి విజ‌యాల్ని ద‌క్కించుకున్న అమృత ప్రొడ‌క్ష‌న్స్ నిర్మాస్తున్న తాజా చిత్రం `క‌ల‌ర్ ఫొటో`. మ‌జిలీ, డియార్ కామ్రేడ్, ప్ర‌తిరోజు పండ‌‌గే వంటి చిత్రాల్లో త‌న‌దైన కామెడీతో ఆక‌ట్టుకున్న సుహాస్ ఈ చిత్రంతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. చాందిని చౌద‌రి హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలోని కీల‌క పాత్ర‌లో సునీల్ క‌నిపించ‌బోతున్నారు. సందీప్ రాజ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రాన్ని సాయి రాజేష్ నీలం, బెన్ని ముప్పానేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్ర టీజ‌ర్‌ని క్రేజీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ రిలీజ్ చేశారు. కామెడీతో సాగే ఓ ఎమోష‌న‌ల్ ల‌వ్ స్టోరీగా ఈ సినిమాని ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తున్నారు. కీర‌వాణి త‌న‌యుడు కాల‌భైర‌వ ఈ చిత్రానికి సంగీతం అందించారు. `నాలాంటి న‌ల్ల‌గున్న అబ్బాయి మీ లాంటి అంద‌మైన అమ్మాయిని ప్రేమిస్తే ఫ్రెండ్స్ కామెంట్స్ చేస్తారు. ఒక‌డేమో బ్లాక్ అండ్ వైట్ అని, మ‌రొక‌డేమో ఆశ‌కు హ‌ద్దు వుండాల‌ని అంటారు` అని టీజ‌ర్‌లో సుహాస్ చెబుతున్న డైలాగ్ సినిమా నేప‌థ్యం ఏంటి? ఎలా వుండ‌బోతోంద‌న్న విష‌యాల్ని తెలియ‌జేస్తోంది.

`న‌వువ్ ప్రేమించిన అమ్మాయి చ‌నిపోయింది. శ‌వం వ‌ద్ద కూర్చుని ఏడుస్తున్నారు. అక్క‌డికో పులి వ‌చ్చింది ఏం చేస్తారు? అని సునిల్ ప్ర‌శ్నిస్తే `పారిపోతాం` అని సుహాస్ చెబుతుండ‌టం,  దానికి బ‌దులుగా `ఇప్పుడు చెప్పు ప్రేమ గొప్ప‌దా భ‌యం గొప్ప‌దా? ` అని సునీల్ అడ‌గ‌డం ఆక‌ట్టుకుంటోంది. ఎంట‌ర్‌టైన్‌మెంట్ వేలో సాగే సీరియ‌స్ ల‌వ్ స్టోరీగా ఈ సినిమా వుంటుంద‌ని సునీల్ పాత్రని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. మొత్తానికి టీజ‌ర్ ప్రామిసింగ్‌గానే క‌నిపిస్తోంది.