మొత్తానికి కలర్స్ స్వాతి పెళ్లి ఫిక్సయ్యింది


colours swathi decided to get married with pilot Vikasహీరోయిన్ కలర్స్ స్వాతి పెళ్లి ఇన్నాళ్లకు ఫిక్స్ అయ్యింది . గతకొంత కాలంగా ఈ భామ సినిమాల్లో నటించకపోవడంతో ఇక పెళ్లి ఖాయమని అంతా అనుకున్నారు పైగా యంగ్ హీరో తో ముడిపెట్టి కథనాలు వచ్చాయి కూడా అయితే స్వాతి వాటిని ఖండించిందనుకోండి , దాంతో మరో హీరో తో ముడిపెట్టి కథనాలు వచ్చాయి కానీ అలాంటి వాటికీ ఫుల్ స్టాప్ పెడుతూ జకార్తా లో ఉంటున్న పైలట్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంటోంది స్వాతి . మలేషియన్ ఎయిర్ లైన్స్ లో పైలట్ గా పనిచేస్తున్న వికాస్ తో స్వాతి పెళ్లి ఈనెల 30న జరుగనుంది .

ఇండోనేషియా జకార్తా లో ఉండే వికాస్ మలేషియన్ ఎయిర్ లైన్స్ లో పైలట్ గా పనిచేస్తున్నాడు కాగా అతడితో ప్రేమలో పడింది స్వాతి . ఇద్దరి ప్రేమ వ్యవహారంతో పెద్దలకు చెప్పడంతో పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు . అయితే పెళ్లయ్యాక స్వాతి హైదరాబాద్ లో ఉంటుందా ? లేక జకార్తా వెళ్తుందా ? అన్నది తేలాల్సి ఉంది . ఇంటర్నేషనల్ పైలట్ ని పెళ్లి చేసుకున్నాక దాదాపుగా సినిమాలకు గుడ్ బై చెప్పడం ఖాయం . యాంకర్ గా పరిచయమైన స్వాతి ఆ తర్వాత హీరోయిన్ గా రాణించింది , తెలుగు , తమిళ , మలయాళ చిత్ర రంగాల్లో తనకంటూ ఓ ఇమేజ్ ని సొంతం చేసుకుంది .

English Title: colours swathi decided to get married with pilot Vikas