మ‌ళ్లీ కెమెరా ముందు హ‌ల్‌చ‌ల్ చేస్తుంద‌ట‌!మ‌ళ్లీ కెమెరా ముందు హ‌ల్‌చ‌ల్ చేస్తుంద‌ట‌!
మ‌ళ్లీ కెమెరా ముందు హ‌ల్‌చ‌ల్ చేస్తుంద‌ట‌!

క‌ల‌ర్స్ స్వాతి మ‌ళ్లీ కెమెరా ముందుకు రాబోతోంది. న‌టిగా బిజీ కావాల‌నుకుంటోంద‌ట‌. న‌టిగా వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా వున్న స‌మ‌యంలోనే పైలెట్ వికాస్‌ని ప్రేమించి పెళ్లిచేసుకున్న స్వాతి ఆ త‌రువాత త‌న మ‌కాంని భ‌ర్త కోసం ఇండోనేషియాలోని జ‌కార్తాకు మార్చేసింది. సినిమాకు గుడ్‌బై చెప్పేసిన క‌ల‌ర్స్ స్వాతి కొంత కాలంగా భ‌ర్త‌తో క‌లిసి అక్క‌డే వుంటూ వ‌స్తోంది.

కానీ వున్న‌ట్టుండి జ‌కార్తాను వీడి హైద‌రాబాద్‌కు వ‌చ్చేసింది. ఇక్క‌డ‌కి రావ‌డ‌మే కాకుండా మ‌ళ్లీ సినిమాల్లో రీ ఉఎంట్రీ ఇవ్వ‌డానికి తాను సిద్ధ‌మ‌ని సంకేతాల్ని అందించింది. త్వ‌ర‌లో ఓ వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ వెబ్ సిరీస్‌కి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో బ‌య‌టికి రానున్నాయి. ఇదిలా వుంటే మ‌ళ్లీ సినిమాల్లోనూ హీరోయిన్‌గా బిజీ కావాల‌నుకుంటోంద‌ట‌.

అయితే త‌న‌కు నచ్చిన పాత్ర‌ల్లో మాత్ర‌మే న‌టిస్తాన‌ని, త‌న‌కున్న ఇమేజ్‌కి త‌గ్గ‌ట్టుగానే సినిమాలు చేయాల‌నుకుంటున్నాన‌ని క‌ల‌ర్స్ స్వాతి స‌న్నిహితుల‌తో వెల్ల‌డించిన‌ట్టు తెలిసింది. ఇప్ప‌టికే తాను మ‌ళ్లీ న‌టించ‌డానికి సిద్ధంగా వున్నాన‌ని చాలా మంది మేక‌ర్స్‌కి క‌ల‌ర్స్ స్వాతి ట‌చ్‌లో వుంద‌ట‌. త్వ‌ర‌లోనే గుడ్ న్యూస్‌ని చెప్ప‌డానికి రెడీ అవుతున్న‌ట్టు ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.