ఆలీ కుప్పిగంతులు


Comedian Ali political game starts

హాస్య నటుడు ఆలీ కుప్పిగంతులు చూసి షాక్ అవుతున్నారు రాజకీయ నాయకులు సైతం . గతకొంత కాలంగా ఆలీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాడని వినబడుతున్న విషయం తెలిసిందే . అయితే ఆలీ కి మొదటి నుండి తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఉంది దాంతో పలుమార్లు తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం కూడా చేసాడు . అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపించిన తరుణంలో మాత్రం చంద్రబాబుని కలిసి టికెట్ కోరాడు .

 

అయితే ప్రస్తుత పరిస్థితిలో టికెట్ ఇవ్వడం కుదరదు కాకపోతే భవిష్యత్ లో మాత్రం తప్పకుండా న్యాయం చేస్తానని చెప్పాడట ! దాంతో ఆలీ జగన్ పంచన చేరాడు . జగన్ ని ముఖ్యమంత్రిగా చూడాలని ఆశపడుతున్నాడట ! టికెట్ ఇవ్వకపోయినా ఫరవాలేదు నేను మాత్రం జగన్ ని సీఎం ని చేస్తాను అని అంటున్నాడు చంద్రబాబు పై  ఆగ్రహంతో . ఆలీ కి ఇంతగా కోపం ఎందుకు వచ్చిందంటే పార్టీ టికెట్ కావాలట అలాగే ప్రభుత్వం లోకి వచ్చాక మంత్రి పదవి కూడా కావాలని అడిగాడట . దానికి చంద్రబాబు నుండి సరైన సమాధానం రాకపోవడంతో ఆలీ జగన్ పార్టీలో చేరాడు . అంతకుముందు నెల రోజుల నుండి ఆలీ జగన్ పార్టీ లో చేరనున్నాడు అని లేదు లేదు పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ కాబట్టి జనసేన లో చేరనున్నాడని వార్తలు వచ్చాయి కట్ చేస్తే జగన్ పంచన చేరాడు దాంతో ఆలీ ప్రత్యక్ష రాజకీయాలలోకి రాకుండానే ఇన్ని కుప్పిగంతులు వేస్తుండటంతో ఆశ్చర్యపోతున్నారు రాజకీయ విశ్లేషకులు .

English Title: Comedian Ali political game starts