వేదిక మీదే చనిపోయిన కమెడియన్

Manjunath naidu
Manjunath naidu

వేదిక మీదే కుప్ప కూలి చనిపోయాడు ఓ కమెడియన్ దాంతో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి . చెన్నై కి చెందిన కమెడియన్ మంజునాథ్ నాయుడు (36) కొంతకాలంగా దుబాయ్ లో ఉంటున్నాడు . స్టాండప్ కమెడియన్ గా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు కాగా అందులో భాగంగానే ఓ స్టార్ హోటల్ లో షో చేస్తున్న సమయంలోనే వేదిక మీద కుప్పకూలి పోయాడు .

అయితే మంజునాథ్ కిందపడటం కూడా షోలో భాగమని అనుకున్నారు నిర్వాహకులు దాంతో ఎంతసేపటికి కూడా పైకి లేవకపోవడంతో అప్పుడు తేరుకొని ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే చనిపోయాడని తేల్చి చెప్పారు డాక్టర్లు . షో చేస్తున్నప్పుడే గుండెపోటు రావడంతో చనిపోయాడని అంటున్నారు డాక్టర్లు .