కీర్తిసురేష్ మ్యారేజ్ రూమ‌ర్స్ వెన‌క ఆ న‌టుడు!


కీర్తిసురేష్ మ్యారేజ్ రూమ‌ర్స్ వెన‌క ఆ న‌టుడు!
కీర్తిసురేష్ మ్యారేజ్ రూమ‌ర్స్ వెన‌క ఆ న‌టుడు!

కీర్తి సురేష్ త్వ‌ర‌లో వివాహం చేసుకోబోంది. గ‌త కొంత కాలంగా ఆమె కోసం ఆమె తండ్రి సంబంధాలు చూస్తున్నార‌ని, ఇటీవ‌లే ఓ రాజ‌కీయ నాయ‌కుడి త‌న‌యుడిని ఫైన‌ల్ చేశాడ‌ని, అత‌నో బిజినెస్ మ్యాన్ అని ఇటీవ‌ల వార్త‌లు జోరుగా వినిపించిన విష‌యం తెలిసిందే. అయితే ఈ వార్త‌లు జోరుగా షికారు చేయ‌డం వెన‌క ఓ న‌టుడు వున్నాడ‌ని తాజాగా బ‌య‌ట ప‌డింది.

అత‌నో క‌మెడియ‌న్‌. పేరు స‌తీష్ ముత్తుక్రిష్ణ‌న్‌. కీర్తి సురేష్ త్వ‌ర‌లో ఓ బీజేపీ నాయ‌కుడి త‌న‌యుడిని వివాహం చేసుకోబోతోంద‌ని, త‌న తండ్రి స్వ‌యంగా కుద‌ర్చిన సంబంధం ఇద‌ని కీర్తి త‌న‌తో చెప్పింద‌ని స‌తీష్ ముత్తు క్రిష్ణ‌న్ మీడియాకు న్యూస్‌ని లీక్ చేశాడు. ఈ విష‌యం గురించి కీర్తిని అడిగితే వ‌చ్చే ఏడాది వ‌ర‌కు త‌న డైరీ ఫుల్ అయిపోయింద‌ని, ఈ స‌మ‌యంలో తాను ఎలా వివాహం చేసుకుంటాన‌ని వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.

కానీ ఇన్ సైడ్ టాక్ మాత్రం మ‌రోలా వున్న‌ట్టు చెబుతున్నారు. త‌న పెళ్లి వార్త‌లు జోరుగా ప్ర‌చారం కావ‌డంతో కీర్తి దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగింద‌ని, దీని కార‌ణం ఎక్క‌డ త‌న చేతి నుంచి పెద్ద సినిమాలు చేజారిపోతాయేమోన‌ని ఆమె భ‌య‌ప‌డుతోంద‌ని త‌మిళ చిత్ర వర్గాల్లో వినిపిస్తోంది. ఇంత‌కీ కీర్తి త‌న వివాహం గురించి స‌తీష్ చెప్పిందా?  లేక తానే కావాల‌ని ఆ వార్త‌ల్ని మీడియాకు లీక్ చేశాడా? అన్న విష‌యంలో మాత్రం క్లారిటీ రావాల్సి వుంది.