సునీల్ కమెడియన్ గా కూడా పనికిరాడా ?

Comedian Sunil career in trouble
Sunil

సునీల్ హీరోగా నటించి చేజేతులా తన కెరీర్ ని నాశనం చేసుకున్నాడు . మొదట్లో కొన్ని సినిమాలు హిట్ కావడంతో ఇక హీరోగా తిరుగులేదని అనుకున్నాడు , కట్ చేస్తే వరుసగా ప్లాప్ లు మొదలయ్యాయి . దాంతో చేసేదిలేక మళ్ళీ కమెడియన్ గా అవతారం ఎత్తాడు .సునీల్  కమెడియన్ గా నటించిన అరవింద సమేత హిట్ కాగా  , అమర్ అక్బర్ ఆంటోనీ డిజాస్టర్ అయ్యింది , ఇక ఇప్పుడేమో పడిపడి లేచె మనసు చిత్రం కూడా అంతగా ఆడటం లేదు దాంతో సునీల్ కెరీర్ ముగిసినట్లే అని అంటున్నారు .

అరవింద సమేత చిత్రంలో నటించాడు కానీ అందులో సునీల్ నవ్వించలేక పోయాడు , అమర్ అక్బర్ ఆంటోనీ పరిస్థితి కూడా అంతే ఇక పడిపడి లేచె మనసు పరిస్థితి అయితే మరీ దారుణం . ఈ సినిమాలో సునీల్ ఆకట్టుకున్న సందర్భమే లేదు . దాంతో ఇక కమెడియన్ గా కూడా పనికి రాడా అన్న అనుమానం తలెత్తుతోంది .

English Title : Comedian Sunil career in trouble