ఇంత‌కీ తెలుగు `మండేలా` ఎవ‌రు?

ఇంత‌కీ తెలుగు `మండేలా` ఎవ‌రు?
ఇంత‌కీ తెలుగు `మండేలా` ఎవ‌రు?

కొత్త త‌ర‌హా చిత్రాల‌కు ఈ మ‌ధ్య ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. కంటెంట్, క‌థ‌ను న‌డిపించే విధానం కొత్త‌గా వుంటే చాలు అందులో ఎవ‌రు న‌టించార‌న్న‌ది కూడా చూడ‌కుండా ఆ సినిమాల‌ని ఓ రేంజ్‌లో ఆద‌రిస్తున్నారు. అనూహ్యంగా కాసుల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన `ఉప్పెన‌`, `జాతిర‌త్నాలు` చిత్రాలు సాధించిన వ‌సూళ్లే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌.

దీంతో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు కూడా కొత్త త‌ర‌హా క‌థ‌ల‌కే అత్య‌ధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా ఆలోచింప‌జేసే క‌థ‌, క‌థనాల‌తో త‌మిళంలో రూపొంది విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్న చిత్రం `మండేలా`.  హాస్య న‌టుడు యోగిబాబు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రాన్ని కొత్త ద‌ర్శ‌కుడు మ‌డోన్నే ఆశ్విన్ రూపొందించారు.

విభిన్న‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో స‌మ‌కాలీన రాజ‌కీయాల‌పై ఓ సెటైరిక‌ల్ మూవీగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇటీవ‌ల నెట్ ఫ్లిక్స్‌లో విడుద‌లైన ఈ మూవీని తెలుగులో రీమేక్ చేయాల‌ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అనిల్ సుంక‌ర ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇందులో యోగిబాబు పాత్ర‌లో సునీల్ క‌నిపించ‌నున్నార‌ని  వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ మూవీని కూడా ఓటీటీలో విడుద‌ల చేస్తార‌ట‌.