వేణుమాధవ్ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తాడట


హాస్య నటుడు వేణు మాధవ్ 2019 లో జరిగే ఎన్నికల్లో శాసనసభ కు పోటీ చేస్తానని అంటున్నాడు అయితే అది తెలుగుదేశం పార్టీ నా లేక జనసేన అన్నది తేలాల్సి ఉంది . జనసేన నుండి టికెట్ ఇస్తే ఎక్కడి నుండైనా పోటీచేసి గెలుపొందుతానని అలాగే తెలుగుదేశం – జనసేన పొత్తు ఉంటుందనే అనుకుంటున్నానని అంటున్నాడు వేణుమాధవ్ . గతకొంత కాలంగా సినిమాలకు దూరమైనా ఈ హాస్య నటుడు మొదటి నుండి తెలుగుదేశం పార్టీ కి సేవలందించాడు .ఆమధ్య జరిగిన నంద్యాల ఉపఎన్నికలో సైతం తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం చేసాడు వేణుమాధవ్ .

అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ని కలవడానికి జనసేన కార్యాలయానికి వెళ్ళాడు కానీ అప్పటికే పవన్ కళ్యాణ్ అక్కడి నుండి ఇంటికి వెళ్లిపోవడంతో నిరాశతో వెనిదిరిగాడు . వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతున్నందున వేణుమాధవ్ ఏ పార్టీ నుండి పోటీ చేస్తాడో చూడాలి .