కమెడియన్ తల్లి మృతి


Comedian Vivek mother passes away
Comedian Vivek mother passes away

తమిళ హాస్య నటుడు వివేక్ తల్లి ఈరోజు చనిపోయింది . గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వివేక్ తల్లి చికిత్స పొందుతోంది , అయితే వయసు మీద పడటంతో ఈరోజు తుది శ్వాస విడిచారు. తల్లి మరణంతో హాస్య నటుడు వివేక్ కన్నీళ్ల పర్యంతం అయ్యాడు . కొన్నాళ్ల క్రితమే ఎదిగి వస్తున్న కొడుకు చనిపోయాడు దాంతో తీవ్ర మానసిక వేదనతో బాధపడుతున్నాడు వివేక్ .

కొడుకు మరణంతో మానసికంగా కృంగిపోయిన వివేక్ సినిమాలు కూడా తగ్గించాడు . ఇక ఇప్పుడేమో తల్లి మరణించడంతో ఆ ఇంట విషాదం నెలకొంది . తమిళ నాట స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న వివేక్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే . వివేక్ తల్లి మరణవార్త తెలియడంతో పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు .