మహర్షి ట్రైలర్ పై విమర్శలు


Maharshi Movie Poster
Maharshi Movie Poster

మహేష్ బాబు నటించిన మహర్షి చిత్ర ట్రైలర్ ని హీరో వెంకటేష్ ఆవిష్కరించాడు . మహర్షి ట్రైలర్ లో మహేష్ మూడు రకాల గెటప్ లలో కనిపిస్తున్నాడు దాంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి . అభిమానులకు మహర్షి ట్రైలర్ విపరీతంగా నచ్చింది , అయితే మహేష్ బాబు యాంటీ ఫ్యాన్స్ మాత్రం మహర్షి ట్రైలర్ చూస్తుంటే ఇది శ్రీమంతుడు పార్ట్ 2 లా ఉందే ! అని విమర్శలు చేస్తున్నారు . యాంటీ ఫ్యాన్స్ విమర్శలు ఎలా ఉన్నప్పటికీ అందులో కొంత నిజం ఉన్నట్లు కూడా కనిపిస్తోంది .

రైతుల సమస్యలపై మహర్షి చిత్రం రూపొందినట్లు కనబడుతోంది . అలాగే ఓ సామాన్యుడు అసామాన్యమైన వ్యక్తిగా ఎలా ఎదిగాడు ? ఎలాంటి విజయాలను సాధించాడు ? అన్న ఇతివృత్తం తో సాగినట్లు కనబడుతోంది . యాక్షన్ తో పాటుగా పూజా హెగ్డే గ్లామర్ కూడా ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది . మహేష్ ఫ్యాన్స్ మహర్షి ట్రైలర్ తో చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఈ వేసవిలో తప్పకుండా పెద్ద హిట్ కొట్టబోతున్నాం అంటూ ధీమాగా ఉన్నారు . యాంటీ ఫ్యాన్స్ మాత్రం హిట్ అయితే గొప్పే ! అనే ధోరణిలో మాట్లాడుతున్నారు . అయితే మహర్షి సత్తా ఏంటి ? అన్నది మే 9 న తేలనుంది .