హీరోయిన్ హన్సిక పై ఫిర్యాదు


complaint against heroine hansika

అందాల బొద్దుగుమ్మ హన్సిక పై ఆమె దగ్గర మేనేజర్ గా పనిచేసిన మునిస్వామి నడిగర్ సంఘంలో ఫిర్యాదు చేసాడు దాంతో ఈ భామకు కొత్త తలనొప్పి వచ్చి పడింది . ఇంతకీ హన్సిక మాజీ మేనేజర్ మునిస్వామి ఎందుకు ఫిర్యాదు చేసాడో తెలుసా …….. హన్సిక దగ్గర చాలా కాలం పాటు మేనేజర్ గా పనిచేశానని కానీ నాకు నయా పైసా కూడా రెమ్యునరేషన్ కింద ఇవ్వలేదని ఇక ఇప్పుడేమో హన్సిక తల్లి ఆమె డేట్స్ చూసుకుంటోందని కావున నాకు న్యాయం చేయండి , నా రెమ్యునరేషన్ ఇప్పించండి అంటూ నడిగర్ సంఘం ని ఆశ్రయించాడు .

 

గతకొంత కాలంగా సరైన సక్సెస్ లేక సతమతం అవుతున్న హన్సిక కు ఇటీవలే గుళేభకావలి చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది . మళ్ళీ కెరీర్ గాడిలో పడుతోంది అని అనుకుంటున్న సమయంలో ఇలా పాత మేనేజర్ సమస్య ఎదురయ్యింది . మరి హన్సిక ఈ వ్యవహారం పై ఎలా స్పందిస్తుందో చూడాలి .