కన్నతల్లి ని బెదిరిస్తున్న హీరోయిన్ సంగీత


కనిపెంచిన తల్లిని ఇంటి నుండి వెళ్లిపొమ్మని బెదిరిస్తోంది హీరోయిన్ సంగీత . తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది సంగీత . ఒక్క తెలుగులోనే కాదు తమిళ చిత్రాల్లో కూడా హీరోయిన్ గా నటించిన ఈ భామ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది . అయితే సినిమాల్లో హీరోయిన్ గా సంగీత నటించిన సమయంలో తల్లి భానుమతి అండగా నిలిచింది . కానీ ముసలిదైన ఈ సమయంలో తల్లికి అండగా ఉండాల్సిన కూతురు మాత్రం నా ఇంట్లో ఉండొద్దు అంటూ హుకుం జారీ చేస్తోందట .

సంగీత బెదిరింపులు ఎక్కువ కావడంతో ఏమి చేయాలో తెలీని స్థితిలో తమిళనాడు పోలీసులను ఆశ్రయించింది భానుమతి . సంగీత తల్లి ఫిర్యాదు తో సంగీతని పిలిపించారు పోలీసులు . నచ్చజెప్పి చూడాలని ప్రయత్నించారు కానీ సంగీత మాత్రం మంకు పట్టు విడవడం లేదు . నా ఇంట్లోంచి వెళ్లిపోవాల్సిందే అని ఖరాఖండిగా చెబుతోంది సంగీత . తల్లికి సపర్యలు చేయాల్సిన ఈ వయసులో సంగీత ఇలా చేయడం విడ్డూరమే !