క‌రోనా ఎఫెక్ట్‌: మోహ‌న్‌లాల్‌పై త‌ప్పుడు ప్ర‌చారం!


క‌రోనా ఎఫెక్ట్‌: మోహ‌న్‌లాల్‌పై త‌ప్పుడు ప్ర‌చారం!
క‌రోనా ఎఫెక్ట్‌: మోహ‌న్‌లాల్‌పై త‌ప్పుడు ప్ర‌చారం!

మ‌ల‌యాళ స్టార్ హీరోపై జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మీష‌న్ సీరియ‌స్ అయ్యిందా?…ఆయ‌న‌పై కేసుని న‌మోదు చేసిందా?.. అంటే అవున‌ని సోష‌ల్ మీడియా ఫేస్ బుక్ వేదిక‌గా వ‌రుస క‌థానాలు రావ‌డం కేర‌ళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో క‌ల‌క‌లం సృష్టించింది. అస‌లు విష‌యం ఏంటా అని ఆరా తీస్తే అవ‌న్నీ త‌ప్ప‌డు ప్ర‌చారాలే అని తేలింది. మోహ‌న్‌లాల్ క‌రోనాపై ఎలాంటి త‌ప్పుడు వార్త‌ల్ని ప్ర‌చారం చేయ‌లేద‌ని, ఆయ‌న‌పై కొంత మంది త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆయ‌న వ్య‌క్త‌గ‌త పీఆర్వో బిను కుమార్ వెల్ల‌డించారు.

ఆయ‌న మాట్లాడుతూ ` హీరో మోహ‌న్‌లాల్‌పై కొంత మంది ఆక‌తాయిలు కావాల‌నే ఇలాంటి త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని, ఇలాంటి వార్త‌ల్ని న‌మ్మోద్ద‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. త‌న‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్న వారిపై మోహ‌న్‌లాల్ చ‌ర్యలు తీసుకోబోతున్నార‌ని, త్వ‌ర‌లోనే వారిపై కేస్ ఫైల్ చేస్తార‌ని వెల్ల‌డించారు. ఇదిలా వుంటే మోహ‌న్‌లాల్‌పై త‌మ‌కు ఎలాంటి ఫిర్యాదు రాలేద‌ని, దీనిపై ఆరాతీస్తామ‌ని క‌మీష‌న్ సభ్యులు వెల్ల‌డించినట్టు తెలిసింది.

మోహ‌న్‌లాల్ న‌టించిన డ్రీమ్ ప్రాజెక్ట్ `మ‌ర‌క్కార్ అర‌బిక్క‌డ‌లైంట్ సింహం` ఈ నెల 26న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. ప‌బ్లిసిటీని కూడా ప్లాన్ చేశారు. అయితే క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా సినిమా విడుద‌లని వాయిదా వేసేశారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మార్పులు వ‌స్తే గానీ `మ‌ర‌క్కార్ అర‌బిక్క‌డ‌లైంట్ సింహం` రిలీజ్ ఎప్పుడ‌నే విష‌యంలో క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం లేదు.