సాహో సెన్సార్ పూర్తి .. 


Sahoo Sensor Review
Sahoo Sensor Review

డై హార్ట్ ఫ్యాన్స్ అమితంగా  ఎదురుచూస్తున్న చిత్రం సాహో. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శ్రద్ద కపూర్ హీరోయిన్ గా యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ,ప్రమోద్ సంయుక్తంగా 350కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన సాహో చిత్రం సెప్టెంబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా నాలుగు భాషల్లో విడుదలకానుంది.

హాలీవుడ్ చిత్రాలకు దీటుగా సుజీత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.. కాగా ఈ చిత్రం ట్రైలర్స్ కి విపరీతమైన వ్యూస్ వస్తున్నాయి.. శ్రీలంక బ్యూటీ జాక్వెలెన్ ఫెర్నాండేజ్ బాడ్ బాయ్ స్పెషల్ సాంగ్ లో నటించింది.
ఈ పాట సెన్సేషన్ సృష్టిస్తుంది. ఈ పాటకోసం జాక్వెలెన్ ఫెర్నాండేజ్ 2కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం.. ఎట్టకేలకు సాహో చిత్రం సెన్సార్ కంప్లీట్ అయ్యింది. యూ/ఎ సర్టిఫికేట్ సాధించిన ఈ చిత్రం సెప్టెంబర్ 30న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.. ప్రస్తుతం చిత్ర యూనిట్ బెంగళూర్, చెన్నై లలో ప్రమోషన్స్ చేస్తూ బిజీగా వున్నారు..