దీపికా – రణ్ వీర్ ల మధ్య కండోమ్ లొల్లి


Condom add between deepika padukone and ranveer singh

దీపికా పదుకోన్రణ్ వీర్ సింగ్ ల పెళ్లి ఇన్నాళ్లకు జరిగితే వాళ్ళ మధ్య కండోమ్ లొల్లి పెడుతోంది ఓ కండోమ్ సంస్థ . రణ్ వీర్ సింగ్ కండోమ్ యాడ్ లో నటిస్తున్న విషయం తెలిసిందే . తమ సంస్థ అందిస్తున్న కండోమ్ కు రణ్ వీర్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుండటంతో కండోమ్ గురించి వివరిస్తూ కండోమ్ లొల్లి మొదలుపెట్టింది ఆ సంస్థ . ఇప్పుడు మాత్రమే కాదు ఇంతకుముందు కూడా విరాట్ కోహ్లీ – అనుష్క ల పెళ్లి సమయంలో కూడా ఈ సంస్థ కండోమ్ ని పెట్టేసి మరీ శుభాకాంక్షలు అందజేసింది .

ఇక ఇప్పుడేమో ఏకంగా తమ బ్రాండ్ అంబాసిడర్ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి , కండోమ్ ప్రాధాన్యత ని వివరిస్తూ ఓ పోస్ట్ పెట్టింది . దీపికా పదుకోన్ – రణ్ వీర్ సింగ్ లు ఇటలీ లో డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకున్నారు . గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న వీళ్ళు ఎట్టకేలకు ఒక్కటయ్యారు . అయితే పెళ్లి ఫోటోలు తొందరగా బయటకు రాకుండా జాగ్రత్తలు పడ్డారు కానీ మొత్తానికి పెళ్లి ఫోటోలు కాస్త ఆలస్యంగా నైనా వచ్చాయి . దాంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

English Title: Condom add between deepika padukone and ranveer singh