పవన్.. ఆ గట్టునుంటావా, ఈ గట్టుకొస్తావా!


పవన్.. ఆ గట్టునుంటావా, ఈ గట్టుకొస్తావా!
పవన్.. ఆ గట్టునుంటావా, ఈ గట్టుకొస్తావా!

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ అనిశ్చితిని ఎదుర్కొంటున్నాడు. కనీసం ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఆస్కారం ఎక్కువ ఉండేది. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోవడంతో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లోనే తన పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే రోజూ ట్విట్టర్ లో ప్రశ్నిస్తూ ఉండలేడు కాబట్టి రాజకీయంగా పవన్ ప్రస్తుతం ఖాళీగా ఉన్నట్లే.

అందుకే పవన్ ను మళ్ళీ సినిమాల్లోకి తీసుకురావాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. అప్పట్లో పవన్ కు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేని స్క్రిప్ట్ ఒకటి తీసుకుని అది చేయమని కోరారు. అలాగే పలువురు దర్శకులు, నిర్మాతలు పవన్ ను కలిసి మళ్ళీ సినిమాల్లోకి వస్తే తమ దగ్గర కథ ఉందని కర్చీఫ్ వేసుకుని వచ్చారు. అయితే పవన్ మాత్రం ఏ విషయం తేల్చట్లేదు.

సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం లేకపోతే దాన్నే ఖరాఖండీగా చెప్పేయొచ్చు. అయితే తన దగ్గరకి వచ్చిన వారి దగ్గర కథలు వింటున్నాడు, ఫీడ్ బ్యాక్ చెబుతున్నాడు. అలా అని సినిమాల్లోకి వచ్చేస్తాడా అని పెదవి విప్పట్లేదు. బహుశా మళ్ళీ సినిమాల్లోకి వస్తే తనను రాజకీయంగా సీరియస్ గా తీసుకోరేమోనని పవన్ భయపడుతుండచ్చు. అందులో నిజం లేకపోలేదు. అయితే ఏదొక విషయం ఖరాఖండీగా చెప్పేస్తే అటు ఇటు అందరూ కుదురుగా ఉంటారు.