త్రివిక్రమ్ ను కాదని ఎన్టీఆర్ అతనితో సినిమా చేస్తాడా?


త్రివిక్రమ్ ను కాదని ఎన్టీఆర్ అతనితో సినిమా చేస్తాడా?
త్రివిక్రమ్ ను కాదని ఎన్టీఆర్ అతనితో సినిమా చేస్తాడా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉన్నాడు. అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ కు అంకితమైపోయిన విషయం తెల్సిందే. 2018లో అరవింద సమేత విడుదలవుతుండగా, 2021లో ఆర్ ఆర్ ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే రెండేళ్ల పాటు ఎన్టీఆర్ సినిమా విడుదల ఉండబోవట్లేదు. ఈ గ్యాప్ ను మైమరపించేలా రాజమౌళి ఎన్టీఆర్ సీన్స్ ను డిజైన్ చేస్తున్నట్లు వినికిడి. ఇదిలా ఉంటే దీని తర్వాత ఎన్టీఆర్ చిత్రం ఏది అనే దానిపై గత రెండు నెలల నుండే ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెల్సిందే.

ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ కన్ఫర్మ్ అని ఇప్పటికే దాదాపు అధికారికంగా వార్తలు వచ్చాయి. హారిక అండ్ హాసిని, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు సమాచారం. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనేది ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ అప్డేట్ మీద ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న మరో సమాచారం ప్రకారం ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కాకుండా మరో దర్శకుడికి కూడా ఎస్ చెప్పాడట. త్రివిక్రమ్ కంటే ముందు ఈ దర్శకుడితోనే సినిమా ఉండనుందని సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు అసురన్ సినిమాతో గతేడాది పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన వెట్రిమారన్.

ధనుష్ హీరోగా వచ్చిన ఈ చిత్రం అక్కడ రికార్డులను తిరగరాసింది. వెట్రిమారన్ ప్రతిభ చూసి రజినీకాంత్ వంటి హీరోనే సినిమా చేయడానికి ఆసక్తి చూపించాడంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. మరి ఇలాంటి ఆఫర్లు పెట్టుకుని వెట్రిమారన్ వేరే భాషకు వచ్చి ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడంటూ వస్తున్న వార్తల్లో నిజం ఎంతుందనుకోవాలి? పైగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కాకుండా వెట్రిమారన్ తోనే ఎన్టీఆర్ తన తర్వాతి చిత్రాన్ని చేయబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. గురూజీ సినిమాను కాదని తమిళ దర్శకుడి కథపై ఎన్టీఆర్ ఆసక్తి పెంచుకున్నాడనుకోవాలా? ఏమో మరి కొన్ని నెలలు ఆగితే కానీ ఈ విషయంపై క్లారిటీ రాదు.