మహేష్ సర్ప్రైజ్ పై ఈ కన్ఫ్యూజన్ ఏంటి?


మహేష్ సర్ప్రైజ్ పై ఈ కన్ఫ్యూజన్ ఏంటి?
మహేష్ సర్ప్రైజ్ పై ఈ కన్ఫ్యూజన్ ఏంటి?

అల వైకుంఠపురములో చిత్ర ప్రమోషన్స్ స్పీడ్ తో సరిలేరు నీకెవ్వరు పూర్తిగా ఒత్తిడిలో పడిపోయింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి బట్టి అల వైకుంఠపురములో చిత్రం ప్రమోషన్స్ పరంగా చాలా ముందుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి ఒక ప్రివ్యూ, సమజవరగమనా అంటూ సాగే మొదటి సింగిల్, సెకండ్ సాంగ్ “రాములో రాముల” సాంగ్ టీజర్ ను విడుదల చేసారు. 26న ఫుల్ సాంగ్ ను విడుదల చేయనున్నారు. ఇక వీటికి తోడు పోస్టర్ల సంగతి సరేసరి.

మరోవైపు సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్స్ బానే ఉన్నా అల వైకుంఠపురములో తో పోల్చుకుంటే డల్ అనే చెప్పాలి. ఒక సాంగ్ విడుదల చేసినా అది సినిమా మొదటి సింగిల్ కాదు. అందులో కూడా రిపీటెడ్ విజువల్స్ వాడారు. పోస్టర్స్ కూడా ఒకట్రెండే వదిలారు. దీపావళికి సర్ప్రైజ్ ఉందన్నారు కానీ అదేమిటన్నది మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. క్లారిటీ ఇవ్వకపోవడంతో ఎవరికి తోచింది వారు అనేసుకుంటున్నారు. ప్రముఖంగా వినిపిస్తున్నది మాత్రం దీపావళికి చిత్ర టీజర్ ను విడుదల చేయబోతున్నారట.

సరిలేరు నీకెవ్వరు టీజర్ విషయంలో వస్తున్న వార్తల ప్రకారం అనిల్ రావిపూడి ఇప్పటికే టీజర్ ను దగ్గరుండి కట్ చేయించాడట. ఈ టీజర్ లో మహేష్ ను ఎలివేట్ చేయడంతో పాటు రష్మిక మందన్నను పరిచయం చేసే షాట్, విజయశాంతి లుక్ వంటివి కూడా ఉన్నాయట. మొత్తంగా ఈ టీజర్ ఒక కంప్లీట్ ప్యాకేజ్ గా ఉండబోతోందని తెలుస్తోంది. అనిల్ రావిపూడి చిత్రాల్లో ఉండే కచ్చితంగా ఉండే ఊతపదం ఈ చిత్రంలో కూడా వాడారట. టీజర్ ఈ పంచ్ తోనే ముగుస్తుందని అంటున్నారు. అనిల్ రావిపూడి టీజర్ ను కట్ చేసి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం దేవి శ్రీ ప్రసాద్ కు పంపించాడని ఈరోజు, రేపటితో ఆ పని కూడా పూర్తవుతుందని, దాన్ని బట్టి ఈ టీజర్ గురించిన అధికారిక సమాచారం వస్తుందని ప్రముఖంగా గాసిప్ హల్చల్ చేస్తోంది.

ఈ న్యూస్ విని మహేష్ ఫ్యాన్స్ ఆనందంలో తేలిపోతున్నారు. ఈ టీజర్ కు ఉన్న రికార్డులన్నీ బద్దలైపోవాలని ఇప్పటినుండే ప్రణాళికలు వేసుకుంటున్నారు. అయితే వారు నిరాశచెందే మరొక న్యూస్ ఏంటంటే ఈ చిత్ర టీజర్ దీపావళికి రావట్లేదట. సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్న ఈ న్యూస్ నిజం కాదని, టీజర్ కాకుండా మరొక సర్ప్రైజ్ ను అనిల్ రావిపూడి ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. టీజర్ కాకపోతే ఏదైనా పాటను రిలీజ్ చేస్తున్నారా లేక ఒక పోస్టర్ తో సరిపెట్టేస్తారా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఏదైనా పాట రిలీజ్ చేస్తే ఓకే కానీ, పోస్టర్ తో సరిపెట్టేస్తే మాత్రం మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహానికి సరిలేరు నీకెవ్వరు బలవ్వడం ఖాయం.

ఈరోజో, రేపో ఆ సర్ప్రైజ్ ఏమిటన్నది అధికారికంగా బయటకు రానుంది కాబట్టి అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.