సరిలేరు నీకెవ్వరు రిలీజ్ డేట్ విషయంలో కన్ఫ్యూజన్


Sarileru Neekevvaru
Sarileru Neekevvaru

2020 సంక్రాంతి హంగామా అప్పుడే మొదలైంది. ఇప్పటికే మహేష్ సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో, రజినీకాంత్ దర్బార్ సంక్రాంతికి వస్తున్నట్లు ముందుగానే ప్రకటించారు. అయితే లేటెస్ట్ గా కళ్యాణ్ రామ్ సంక్రాంతికి ఒక చిన్న సినిమా విడుదలవ్వడమైనా ఆనవాయితీ అంటూ తన లేటెస్ట్ మూవీ ఎంత మంచివాడవురాను సంక్రాంతి బరిలో దింపాడు.

ఎంత మంచివాడవురా జనవరి 15కి వస్తున్నట్లు కళ్యాణ్ రామ్ అండ్ కో స్పష్టం చేసారు. రజినీకాంత్ దర్బార్ కూడా జనవరి 10 రిలీజ్ డేట్ ను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం అల వైకుంఠపురములో జనవరి 12న విడుదల కానుందని బన్నీ క్లోజ్ సోర్సెస్ చెబుతున్నాయి. వీళ్లందరి సంగతి బానే ఉంది కానీ మహేష్ బాబు నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు రిలీజ్ డేట్ పై కొంత కన్ఫ్యూజన్ ఉందట.

ముందుగా నిర్మాతలు సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని జనవరి 11న విడుదల చేయాలని భావించారు. అయితే మహేష్ దీనికి ససేమీరా అంటున్నాడట. జనవరి 11 అంటే రెండు సినిమాల మధ్య విడుదల చేయడం అంత మంచిది కాదని, జనవరి 14 అయితే అన్ని రకాలుగా బాగుంటుందని అంటున్నాడట. అందుకే ఈ రెండు డేట్ల మధ్య మహేష్ అండ్ కో మధ్య చర్చలు జరుగుతున్నట్లు వినికిడి.