రేవంత్ రెడ్డి అరెస్ట్ ఖాయమట


Congress leader revanth reddy sensational comments on CM KCR

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు కంటిలో నలుసులా తయారైన ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలులో పెట్టడం ఖాయమని తెలుస్తోంది . ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు జగ్గారెడ్డిని మనుషుల అక్రమ రవాణా కేసులో అరెస్ట్ చేయగా మరో నాయకుడు గండ్ర వెంకటరమణారెడ్డిపై కేసు నమోదు చేసారు , ఇక ఇప్పుడు ఓటుకి నోటు కేసులో రేవంత్ రెడ్డిని మరోసారి అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది . ఈ విషయాన్నీ రేవంత్ రెడ్డి స్వయంగా వెల్లడించడం విశేషం . నేను బయట ఉంటే తెలంగాణ అంతటా తిరిగి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడిస్తానని భావించి నన్ను అరెస్ట్ చేయించేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని నన్ను అరెస్ట్ చేస్తే ,నాకేమైనా జరిగితే దానికి కేసీఆర్ తో పాటుగా తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి , ఇంటలిజెన్స్ డి ఐ జి ప్రభాకర్ రావులే బాధ్యత వహించాలని హెచ్చరించాడు రేవంత్ .

కేసీఆర్ నిరంకుశ పాలన సాగిస్తున్నాడని దాన్ని ప్రజలే అంతమొందించాలని విజ్ఞప్తి చేసాడు రేవంత్ రెడ్డి . నాపైన మాత్రమే కాకుండా నా బంధువుల ఇళ్లపై కూడా నిఘా పెట్టారని ,ఎప్పుడు సమయం దొరుకుతుందా అని ఎదురుచూస్తున్నారని , రాబోయే రెండు మూడు రోజుల్లో నన్ను అరెస్ట్ చేయడం ఖాయమని ఆమేరకు నాకు ఖచ్చితమైన సమాచారం ఉందని , అయితే నిరంకుశంగా వ్యవహరిస్తున్న అధికారుల పని పడతామని మేము అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా బాకీ తీర్చుకుంటామని అంటున్నాడు కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి .

English Title: Congress leader revanth reddy sensational comments on CM KCR